- కూకట్‌పల్లి భూములపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్యే మాధవరం సవాల్
- మియాపూర్, హౌసింగ్ బోర్డు భూములను అమ్ముతున్నారని ఆరోపణ
- మంత్రి పొన్నం ప్రభాకర్‌కు నగరంపై అవగాహన లేదంటూ విమర్శ
కూకట్‌పల్లి భూముల వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి బహిరంగ సవాల్ విసిరారు. కూకట్‌పల్లిలో తాను ఒక్క ఎకరం భూమి అమ్మినట్లు నిరూపిస్తే, వారి ఇంట్లో ఊడిగం చేయడానికి సిద్ధమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాము పోరాడి సాధించిన మియాపూర్ భూములపై కోర్టు ఆర్డర్ కాపీ రాకముందే ప్రభుత్వం వేలానికి సిద్ధమైందని మాధవరం ఆరోపించారు. హౌసింగ్ బోర్డుకు చెందిన భూములను కూడా ఇష్టానుసారంగా అమ్ముతున్నారని, ఇవన్నీ పేదలకు చెందినవని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ను విమర్శిస్తూ, ఆయనకు హైదరాబాద్ నగరంపై కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు.
"చెరువుల అభివృద్ధికి రూ.50 కోట్లు ఖర్చు పెడుతూ, మరోవైపు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అమ్మడం ఎంతవరకు సమంజసం?" అని మాధవరం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పేదలకు చెందిన భూముల అమ్మకం విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ చూస్తూ ఊరుకోబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై తన పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.