టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో ఎన్నో గొప్ప రికార్డులను అందుకున్నాడు. కానీ, తాజాగా ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత బ్యాటర్‌గా సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ సమం చేశాడు. నిన్న‌ మౌంట్ మాంగనూయిలోని బే ఓవల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో కోహ్లీ పేరిట ఈ చెత్త రికార్డు న‌మోదైంది.

ఈ జాబితాలో సచిన్, కోహ్లీ తర్వాత భారత మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ (19 డకౌట్లు) మూడో స్థానంలో ఉన్నాడు. అనిల్ కుంబ్లే, రోహిత్ శర్మ 18 డకౌట్లతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. 

ఇక‌, నిన్న‌టి మ్యాచ్‌లో టీమిండియా 244 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్, విల్ యంగ్ (125) అద్భుత సెంచరీతో 333 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్యఛేదనలో భారత్ కేవలం 89 పరుగులకే కుప్పకూలింది. 26 ఏళ్లలో టీమిండియాకు వన్డేల్లో ఇదే అతిపెద్ద ఓటమి.