- రాకెట్ విడిభాగాల తయారీ సంస్థలకు భారీ ప్రోత్సాహం
- ఏపీ పనితీరులోని వేగమే మన అతిపెద్ద బలం అని వెల్లడి
- దేశంలోనే ప్రత్యేకంగా డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ పాలన
- పరిశోధనలు మరియు అంతరిక్ష ప్రయోగాల వ్యయం తగ్గింపుపై దృష్టి
విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ సదస్సు వేదికగా రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను అంతరిక్ష రంగానికి సరికొత్త గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. సదస్సులో రెండో రోజైన శుక్రవారం ‘కక్ష్య నుంచి అవకాశాల దిశగా: భారతదేశ నూతన అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ’ (From Orbit to Opportunity: India’s New Space Economy) అనే అంశంపై ప్రత్యేక చర్చ జరిగింది. బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ సీఈవో రోహన్ గణపతి మోడరేటర్‌గా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ పాల్గొని, రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను, భవిష్యత్ ప్రణాళికలను పంచుకున్నారు.
కేంద్ర ప్రభుత్వ పరిధిలో ప్రధానంగా ఉండే అంతరిక్ష రంగంలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఏమిటన్న ప్రశ్నకు మంత్రి సమగ్రంగా బదులిచ్చారు. పరిశ్రమల అభివృద్ధికి వర్టికల్, హారిజాంటల్ ఇంటిగ్రేషన్ వ్యూహాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. వర్టికల్ ఇంటిగ్రేషన్ ద్వారా స్కైరూట్ వంటి ప్రధాన స్పేస్ సంస్థలకు అవసరమైన విడిభాగాలను తయారు చేసే సరఫరాదారులను ఒకే చోటకు చేర్చుతామన్నారు. దీనివల్ల రాకెట్ వాహనాల తయారీ, అసెంబ్లింగ్, ప్రయోగాలు మరింత సులభతరం అవుతాయని చెప్పారు. ఇక హారిజాంటల్ ఇంటిగ్రేషన్‌లో భాగంగా విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య సమన్వయం పెంచుతున్నామని తెలిపారు. పాఠ్యాంశాల ఆధునీకరణ, సరికొత్త పరిశోధనలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ల ద్వారా టెస్టింగ్, సర్టిఫికేషన్ సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే ఐఐటీ తిరుపతి భాగస్వామ్యంతో ఇంధన రంగంలో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
దేశంలో స్పేస్ సిటీల అభివృద్ధికి అనువైన ఒక సమగ్ర జాతీయ విధానం రావాల్సిన అవసరం ఉందని లోకేశ్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అంతరిక్ష పరిశ్రమలకు వెన్నుదన్నుగా నిలిచే ఎంఎస్ఎంఈలను గుర్తించి, ప్రోత్సహించాలన్నారు. ఇటీవల తాను కలిసిన ఒక చిన్న పరిశ్రమ రాకెట్‌కు అవసరమైన అత్యాధునిక షీల్డ్‌లను తయారు చేస్తోందని, ఇలాంటి సంస్థలన్నింటినీ ఒకే ఎకోసిస్టమ్‌లోకి తీసుకువచ్చినప్పుడే నిజమైన పారిశ్రామిక విప్లవం సాధ్యమవుతుందని అన్నారు.
రాష్ట్ర అభివృద్ధి వేగం గురించి ప్రస్తావిస్తూ.. దేశంలోని చాలా రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే, ఏపీలో మాత్రం ‘డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్’ నడుస్తోందని మంత్రి వ్యాఖ్యానించారు. కేంద్రంలో భాగస్వామ్యం ఉండటం వల్ల రాష్ట్ర ప్రయోజనాలతో పాటు జాతీయ విధానాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నామని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత ‘స్పీడ్’ అని, యువత భవిష్యత్తు కోసం ప్రతి పనినీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడమే తమ బలం అని స్పష్టం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష రంగంలో వస్తున్న మార్పులను ప్రస్తావిస్తూ, చైనా మరియు పాశ్చాత్య దేశాల తరహాలో భారత్‌లోనూ ప్రయోగాల వ్యయాన్ని గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉందని లోకేశ్ సూచించారు. ప్రైవేట్ భాగస్వామ్యం, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే ఇది సాధ్యమవుతుందన్నారు. స్పేస్ పాలసీ 4.0, తిరుపతిలో ప్రతిపాదిత స్పేస్ సిటీ ద్వారా రాబోయే రోజుల్లో ఏపీ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో అగ్రగామిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం రాయితీలతో కాకుండా నాయకత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థలు, పెట్టుబడిదారుల కలయికతోనే బలమైన ఎకోసిస్టమ్ ఏర్పడుతుందని, ముఖ్యమంత్రి నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడమే తమ బాధ్యతని మంత్రి తెలిపారు.
ఈ చర్చా కార్యక్రమంలో ఇస్రో వ్యోమగామి ఎయిర్ కమోడోర్ ప్రశాంత్ బి. నాయర్, అగ్నికుల్ సీఈవో శ్రీనాథ్ రవిచంద్రన్, తిరుపతి ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కే.ఎన్. సత్యనారాయణ, గెలాక్స్ఐ సీఈవో సుయాష్ సింగ్, స్కైరూట్ ఏరోస్పేస్ కో-ఫౌండర్ డాకా నాగ భరత్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.