- ఏఐ స్టార్టప్ మెర్కార్కు తాజాగా రూ.7,057 కోట్ల పెట్టుబడులు
- దీంతో రూ.1.88 లక్షల కోట్లకు చేరిన సంస్థ విలువ
- దీంతో ఆదర్శ్, సూర్య సంపద చెరో రూ.40 వేల కోట్లకు చేరినట్లు అంచనా
- ఏఐ రంగంలో ప్రపంచ స్థాయిలో ఎదుగుతున్న యువ పారిశ్రామికవేత్తలు
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో భారత సంతతికి చెందిన 23 ఏళ్ల ఇద్దరు యువ పారిశ్రామికవేత్తలు అరుదైన ఘనత సాధించారు. అమెరికాలో ఏఐ స్టార్టప్ మెర్కార్‌ను స్థాపించిన ఆదర్శ్ హిరేమఠ్, సూర్య మిధా సంపద ఒక్కసారిగా రెట్టింపైంది. సంస్థకు తాజాగా 750 మిలియన్ డాలర్ల (సుమారు రూ.7,057 కోట్లు) పెట్టుబడులు రావడంతో దాని విలువ 20 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.1.88 లక్షల కోట్లు) చేరింది. దీంతో ఈ ఇద్దరి సంపద ఒక్కొక్కరికి దాదాపు రూ.40 వేల కోట్లకు చేరినట్లు ఫోర్బ్స్ అంచనా వేసింది. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసులో స్వయంకృషితో బిలియనీర్లుగా ఎదిగిన వారిలో వీరూ చోటు సంపాదించారు.
మెర్కార్ సహ వ్యవస్థాపకులు, సీఈఓ బ్రెండన్ ఫూడీ, సీటీఓ ఆదర్శ్ హిరేమఠ్, బోర్డు ఛైర్మన్ సూర్య మిధాలకు సంస్థలో చెరో 21 శాతం వాటా ఉంది. ఈ వాటాల ఆధారంగా ఒక్కొక్కరి సంపద 4.2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.40 వేల కోట్లు)గా ఫోర్బ్స్ లెక్కగట్టింది. 2025 అక్టోబర్‌లో సంస్థ 10 బిలియన్ డాలర్ల విలువతో 350 మిలియన్ డాలర్ల పెట్టుబడులు సమీకరించినప్పుడు వీరి సంపద 2.2 బిలియన్ డాలర్లుగా ఉండేది. తాజా సిరీస్-డి పెట్టుబడుల ప్రకటన నవంబర్ 10న వెలువడింది. బెంచ్‌మార్క్, జనరల్ కాటలిస్ట్, ఎన్విడియా, సేల్స్‌ఫోర్స్, ఫెలిసిస్, అపోలో అనుబంధ నిధులు, జూమ్ తదితర సంస్థలు ఇందులో పాల్గొన్నాయి.
పాఠశాల రోజుల నుంచే స్నేహం
ఆదర్శ్, సూర్య ఇద్దరూ అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాన్‌జోస్‌లో ఉన్న బెల్లార్మైన్ కాలేజ్ ప్రిపరేటరీలో చదువుకున్నారు. అక్కడ డిబేట్ బృందంలో సభ్యులుగా ఉన్నారు. ఒకే ఏడాదిలో మూడు ప్రధాన జాతీయ పాలసీ డిబేట్ పోటీల్లో విజయం సాధించి తమ పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు.
సూర్య మిధా కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఢిల్లీ నుంచి అమెరికాకు వలస వెళ్లారు. జార్జ్‌టౌన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఫారిన్ సర్వీస్‌లో చేరిన ఆయన, 2023లో చదువుకు విరామం ఇచ్చి పాఠశాల స్నేహితులతో కలిసి మెర్కార్‌ను స్థాపించారు. భారత మూలాలున్న కుటుంబానికి చెందిన ఆదర్శ్.. హార్వర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదివారు. రెండేళ్ల తర్వాత చదువు మధ్యలోనే ఆపి స్టార్టప్‌పై దృష్టి పెట్టారు.
వీరు బిలియనీర్ పెట్టుబడిదారు పీటర్ థీల్ మద్దతుతో నడిచే థీల్ ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. సంప్రదాయ విద్యాభ్యాసం కంటే వ్యాపార ఆలోచనలకు ప్రాధాన్యమిచ్చే యువ పారిశ్రామికవేత్తలకు ఈ కార్యక్రమం లక్ష డాలర్ల నిధులు అందిస్తుంది.
రిక్రూట్‌మెంట్ వేదిక నుంచి ఏఐ సంస్థలకు సేవలు
2023లో ప్రారంభమైన మెర్కార్ తొలుత అమెరికా కంపెనీలకు భారత్ సహా వివిధ దేశాల ఫ్రీలాన్స్ సాఫ్ట్‌వేర్ డెవలపర్లను అనుసంధానించే రిక్రూట్‌మెంట్ వేదికగా పనిచేసింది. ప్రస్తుతం వైద్యం, న్యాయ, ఆర్థిక, ఇంజినీరింగ్ రంగాల్లో ప్రత్యేక పరిజ్ఞానం ఉన్న నిపుణులను ఏఐ కంపెనీలతో కలుపుతోంది. వీరి సాయంతో ఏఐ మోడళ్లకు శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన డేటాను రూపొందించడం, వాటి పనితీరును అంచనా వేయడం, సామర్థ్యాన్ని మెరుగుపరచడం వంటి సేవలు అందిస్తోంది.
తాజాగా వచ్చిన పెట్టుబడులను ఏఐ మోడళ్ల మూల్యాంకనం, శిక్షణ అనంతర అభివృద్ధి కార్యకలాపాల విస్తరణకు వినియోగించనున్నట్లు సంస్థ తెలిపింది. వ్యాపార సంస్థలు తమ సొంత డేటా, ప్రత్యేక పరిజ్ఞానంతో ఏఐ ఏజెంట్లను అభివృద్ధి చేసుకోవడం, వాటి పనితీరును పరీక్షించడంలోనూ సహకరించాలని మెర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది.
కంపెనీ సీఈఓ ఫూడీ ఎక్స్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం.. 27 నెలల్లో సంస్థ ఆదాయం 1 మిలియన్ డాలర్ల నుంచి 3 బిలియన్ డాలర్ల వార్షిక రన్‌రేట్‌కు చేరింది. తాజా నెలలో 250 మిలియన్ డాలర్ల స్థూల అమ్మకాలు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే వినియోగదారుల సంఖ్య రెట్టింపునకు పైగా పెరిగి 100 దాటింది. తాజా పెట్టుబడులతో మెర్కార్ విలువ గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే రెండింతలైంది.