- కొత్త సీఈఓ కోసం ఎన్విడియా అన్వేషణ
- ఈ పోటీలో భారతీయ మూలాలున్న ముగ్గురి పేర్లు
- సంజయ్ మెహ్రోత్రా, నికేష్ అరోరా, థామస్ కురియన్ పేర్లు వినిపిస్తున్న వైనం
- టిమ్ కుక్ వంటి టెక్నాలజీ దిగ్గజాల పేర్లూ పరిశీలనలో
ప్రపంచ టెక్నాలజీ రంగంలో కీలక సంస్థగా ఎదిగిన చిప్ తయారీ దిగ్గజం ఎన్విడియాకు తదుపరి సీఈఓ ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుత సీఈఓ జెన్సన్ హువాంగ్ వైదొలగడంతో ఆయన స్థానంలో శాశ్వతంగా బాధ్యతలు చేపట్టే వ్యక్తి కోసం కంపెనీ బోర్డు అన్వేషణ ప్రారంభించింది. ఈ పోటీలో భారతీయ మూలాలున్న ముగ్గురు ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. మైక్రాన్ టెక్నాలజీ సీఈఓ సంజయ్ మెహ్రోత్రా, పాలో ఆల్టో నెట్‌వర్క్స్ అధిపతి నికేష్ అరోరా, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ పేర్లను పరిశీలిస్తున్నట్లు రాయిటర్స్ కథనం వెల్లడించింది.
సంజయ్ మెహ్రోత్రా 2017 నుంచి మైక్రాన్ టెక్నాలజీకి సారథ్యం వహిస్తున్నారు. అంతకుముందు 1988లో శాన్‌డిస్క్ సంస్థను సహ వ్యవస్థాపకుడిగా ప్రారంభించి, తర్వాత దానికి సీఈఓగా పనిచేశారు. సెమీకండక్టర్ రంగంలో ఆయనకున్న అనుభవం, ఎన్విడియాతో మైక్రాన్‌కు ఉన్న వ్యాపార సంబంధాలు ఆయనకు కలిసిరావచ్చని భావిస్తున్నారు.
నికేష్ అరోరా 2018 నుంచి సైబర్ సెక్యూరిటీ సంస్థ పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌కు నాయకత్వం వహిస్తున్నారు. గతంలో సాఫ్ట్‌బ్యాంక్, గూగుల్‌లో కీలక బాధ్యతలు నిర్వహించారు. పెద్ద టెక్నాలజీ సంస్థలను నిర్వహించిన అనుభవం ఆయనకు బలంగా మారవచ్చని ఇన్వెస్టర్లు భావిస్తున్నట్లు ఎకనామిక్ టైమ్స్ కథనం పేర్కొంది. అయితే చిప్ తయారీ రంగంలో ఆయనకు ప్రత్యక్ష అనుభవం లేదు.
థామస్ కురియన్ గూగుల్ క్లౌడ్ సీఈఓగా కొనసాగుతున్నారు. క్లౌడ్ మౌలిక సదుపాయాలు, ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్, కృత్రిమ మేధ సేవలను పర్యవేక్షిస్తున్నారు. పెద్ద స్థాయి టెక్నాలజీ కార్యకలాపాలను నిర్వహించడంలో, కార్పొరేట్ వినియోగదారులతో సంబంధాలు కొనసాగించడంలో ఆయనకు మంచి అనుభవం ఉంది. అయితే చిప్ డిజైన్‌లో ప్రత్యక్ష అనుభవం లేకపోవడం ప్రతికూలంగా మారవచ్చు.
ఈ ముగ్గురితో పాటు ఎన్విడియా ప్రస్తుత తాత్కాలిక సీఈఓ, సీఎఫ్‌ఓ కొలెట్ క్రెస్, సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఇయాన్ బక్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. క్రెస్ 2013 నుంచి ఎన్విడియాలో పనిచేస్తున్నారు. ఇయాన్ బక్ 2004లో సంస్థలో చేరి, గ్రాఫిక్స్ ప్రాసెసర్ల వినియోగాన్ని గేమింగ్ దాటి విస్తరించడంలో కీలకమైన ‘కుడా’ సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.
ఆర్మ్ సీఈఓ రెనే హాస్, ఇంటెల్ మాజీ సీఈఓ పాట్ గెల్సింగర్, ఏఎండీ సీఈఓ లిసా సూ, మార్వెల్ టెక్నాలజీ సీఈఓ మ్యాట్ మర్ఫీ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. యాపిల్ చీఫ్ హార్డ్‌వేర్ అధికారి జానీ స్రౌజీ, ఆ సంస్థ మాజీ సీఈఓ టిమ్ కుక్ పేర్లనూ కొన్ని కథనాలు ప్రస్తావించాయి. టిమ్ కుక్ పేరును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థిస్తున్నట్లు సమాచారం.
తదుపరి సీఈఓకు ఎన్విడియా వేగంగా విస్తరిస్తున్న వ్యాపారాన్ని నిర్వహించడంతో పాటు, అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు, ఎగుమతి ఆంక్షలు, పోటీ సంస్థల నుంచి సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏఐ రంగంలో భారీ పెట్టుబడులపై పెరుగుతున్న పరిశీలన మధ్య వినియోగదారులు, సాంకేతిక భాగస్వాములతో సంబంధాలను కొనసాగిస్తూ సంస్థ ఆధిపత్యాన్ని నిలబెట్టాల్సి ఉంటుంది.