- అంతరిక్ష ఆర్థిక వ్యవస్థకు ఏపీని కేంద్రంగా మార్చేందుకు ప్రణాళిక
- హైదరాబాద్ కంటే పెద్దగా భోగాపురం విమానాశ్రయం అభివృద్ధి లక్ష్యం
- అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు
- విశాఖలో సినీ రంగం క్రియేటర్ ఎకానమీ అభివృద్ధికి సన్నాహాలు
- సమస్యల పరిష్కారంలో భాగస్వామ్యం అయ్యేందుకు యువత రాజకీయాల్లోకి రావాలన్న లోకేశ్
భవిష్యత్ సాంకేతికత, మౌలిక వసతులు, వినోద రంగాల మేళవింపుతో ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ స్థాయి అవకాశాల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ రెండో రోజు కార్యక్రమంలో ఆయన విస్తృతంగా పాల్గొన్నారు. అంతరిక్ష ఆర్థిక వ్యవస్థపై నిర్వహించిన ప్రత్యేక చర్చతో పాటు, ప్రముఖ సినీ నటుడు రానా దగ్గుబాటి నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో లోకేశ్ పాల్గొని రాష్ట్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం అనుసరిస్తున్న కార్యాచరణను వివరించారు.
అంతరిక్ష, అత్యాధునిక సాంకేతిక రంగాలకు ఏపీ వేదిక
'కక్ష్య నుంచి అవకాశాల దిశగా: భారతదేశ నూతన అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ' అంశంపై జరిగిన చర్చలో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. అంతరిక్ష రంగానికి ఆంధ్రప్రదేశ్‌ను ప్రధాన గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ రంగంలో విడిభాగాల తయారీ సంస్థలను రాష్ట్రానికి ఆకర్షించడమే తమ లక్ష్యమన్నారు. 'డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్' తరహాలో 'స్పీడ్ ఏపీ' లక్ష్యంతో పాలన సాగిస్తున్నామని చెప్పారు. అలాగే అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి 156 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ను ఏర్పాటు చేయబోతున్నామని, సీఎం చంద్రబాబు చొరవతో ప్రపంచ స్థాయి నిపుణులను ఇందుకోసం ఏకతాటిపైకి తెచ్చామని వెల్లడించారు.
రాష్ట్రాభివృద్ధికి గేట్‌వే భోగాపురం ఎయిర్పోర్ట్
నటుడు రానా నిర్వహించిన ‘ది పవర్ ఆఫ్ పాజిబిలిటీ: బిల్డింగ్ పార్ట్నర్షిప్స్, క్రియేటింగ్ ది ఫ్యూచర్’ పాడ్‌కాస్ట్‌లో మంత్రి లోకేశ్ పలు కీలక విషయాలు పంచుకున్నారు. విశాఖ నగరం రాష్ట్రానికి ప్రవేశ ద్వారమైతే, భోగాపురం విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి గేట్‌వే లాంటిదని పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ హైదరాబాద్ విమానాశ్రయం కంటే పెద్దదిగా ఎదిగిన రోజే తనకు నిజమైన సంతృప్తి కలుగుతుందన్నారు. విశాఖలో అంతర్జాతీయ సదస్సులకు అనుగుణంగా ఆతిథ్య రంగాన్ని విస్తరిస్తున్నామని, ఇప్పటికే 17 స్టార్ హోటళ్ల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. అరకు లోయలో మారథాన్ నిర్వహణకు మహీంద్రా సంస్థతో చర్చిస్తున్నామని, అరకు కాఫీ తరహాలోనే రాష్ట్రంలోని ప్రత్యేకతలను ప్రపంచ బ్రాండ్లుగా నిలబెట్టాలన్నారు.
విశాఖలో సినీ పరిశ్రమ, క్రియేటర్ ఎకానమీ అభివృద్ధి
భవిష్యత్తులో క్రియేటర్ ఎకానమీ విస్తృత అవకాశాలను కల్పిస్తుందని లోకేశ్ పేర్కొన్నారు. సినిమా, యూట్యూబ్, గేమింగ్ అన్నీ ఇందులో భాగమేనని, చేతిలో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరిలోనూ సృజనాత్మకత కనిపిస్తోందన్నారు. హైదరాబాద్ తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌లోనూ సినిమా నిర్మాణానికి అవసరమైన అన్ని సదుపాయాలు ఒకేచోట కల్పించేలా ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. ఇందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించాలని రానాను కోరగా, విశాఖలో సినిమా, క్రియేటివ్ రంగాల అభివృద్ధికి సోమవారం నాటికే సమగ్ర బ్లూప్రింట్ సిద్ధం చేస్తానని రానా హామీ ఇచ్చారు. రాబోయే ఏడాదిలో విశాఖలో తమ సంస్థ తరఫున నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభిస్తామని రానా ప్రకటించారు. అంతేకాకుండా తిరుపతి, విశాఖల్లో సినిమా, సంగీతం, గేమింగ్, యానిమేషన్ విభాగాల్లో యువతకు ఏఐ సాంకేతికతతో శిక్షణ అందించేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నామని, సంగీత శిక్షణ కోసం సంగీత దర్శకుడు తమన్‌తో కలిసి పనిచేసే యోచన ఉందని లోకేశ్ తెలిపారు.
యువత రాజకీయాల్లోకి రావాలి
సమస్యలను కేవలం విమర్శించడమే కాకుండా, పరిష్కారాల్లో భాగస్వామ్యం అయ్యేందుకు యువత రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని లోకేశ్ పిలుపునిచ్చారు. ప్రస్తుత కేబినెట్లోని 25 మంది మంత్రుల్లో 17 మంది యువకులేనని గుర్తుచేశారు. యువ పారిశ్రామికవేత్తలు వైఫల్యాలకు భయపడకూడదని, 'FAIL' అంటే 'First Attempt In Learning' అని వ్యాఖ్యానించారు. హెరిటేజ్ ప్రారంభానికి ముందు మూడు ప్రయత్నాలు విఫలమైనా పట్టువదలకుండా పోరాడిన చంద్రబాబును ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ సదస్సుకు 58 దేశాల ప్రతినిధులు, 15 మంది విదేశీ మంత్రులు హాజరుకావడం రాష్ట్ర పారిశ్రామిక సత్తాకు నిదర్శనమని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.