- తెలంగాణలోని వికారాబాద్‌లో బీసీసీఐ అండర్-19 క్రికెటర్ నందిని ఆత్మహత్య
- ఇద్దరు యువకుల వేధింపులే కారణమని కుటుంబసభ్యుల ఆరోపణ
- కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసిన వికారాబాద్ పోలీసులు
- నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ స్థానికులు, బంధువుల రాస్తారోకో
- తీవ్ర దిగ్భ్రాంతికి గురైన స్థానిక క్రీడా వర్గాలు
తెలంగాణలోని వికారాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. బీసీసీఐ అండర్-19 మహిళా జట్టుకు ఎంపికైన వర్ధమాన క్రీడాకారిణి నందిని (17) శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. స్థానిక యువకుల నుంచి ఎదురైన వేధింపులు భరించలేకే ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చక్కని భవిష్యత్ ఉన్న యువ క్రికెటర్ అర్ధాంతరంగా తనువు చాలించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
యాలాల మండలం సంగయ్యపల్లి గ్రామానికి చెందిన నందిని, క్రికెట్‌లో రాణించాలనే లక్ష్యంతో వికారాబాద్ పట్టణానికి వచ్చింది. మధు కాలనీ సమీపంలోని తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ నిత్యం క్రికెట్ కోచింగ్ తీసుకుంటోంది. ఆమె కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఇటీవల బీసీసీఐ అండర్-19 జట్టుకు ఎంపికైంది. త్వరలోనే ఉన్నత స్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉండగా ఈ విషాదం చోటుచేసుకుంది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అనిల్, కృష్ణ అనే ఇద్దరు స్థానిక యువకులు గత కొంతకాలంగా నందినిని నిరంతరం వేధింపులకు గురిచేస్తున్నారు. వారిలో ఒకరు ప్రేమ పేరుతో ఆమెను వేధించగా, మరొకరు అతనికి సహకరిస్తూ వచ్చారు. ఈ వేధింపులతో తీవ్ర మానసిక ఆందోళనకు గురైన నందిని, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు యువకులపై దర్యాప్తు ప్రారంభించారు.
మరోవైపు నందిని ఆత్మహత్యకు కారణమైన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు వికారాబాద్ పట్టణంలో రాస్తారోకో చేపట్టారు. దీంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయి కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ప్రతిభావంతురాలైన యువ క్రికెటర్ ఇలా అర్థాంతరంగా తనువు చాలించడంతో స్థానిక క్రీడా వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశాయి.