- హైదరాబాద్‌లో ఆటోరిక్షా కార్మికుల కోసం రూ.220 కోట్లతో 2 వేల ఇళ్లు
- బండ్లగూడ, గంధంగూడ, పేట్‌బషీరాబాద్, జల్‌పల్లి/లక్ష్మీగూడ ప్రాంతాల్లో ఒక్కో చోట 500 ఇళ్లు
- ఇందిరమ్మ ఇళ్లు-టవర్ల తరహాలోనే ఆటో కార్మికుల కోసం ఈ కాలనీ
- ఆటోరిక్షా కార్మికులకు ఇళ్ల పథకం చేపట్టాలని తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ ప్రతిపాదనకు ప్రభుత్వ అనుమతి
హైదరాబాద్‌లో ఆటోరిక్షా కార్మికులకు తక్కువ ధరకు ఇళ్లు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక గృహ నిర్మాణ పథకానికి ఆమోదం తెలిపింది. ‘ఆటో నగర్ కాలనీ’ పేరుతో రూ.220 కోట్ల అంచనా వ్యయంతో 2 వేల ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాల) ఇళ్లను నిర్మించనున్నారు. నగరంలోని నాలుగు ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు తెలంగాణ హౌసింగ్ బోర్డుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పేదల కోసం అమలు చేస్తున్న ‘ఇందిరమ్మ ఇళ్లు’ పథకంలో భాగంగా నగరంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లు-టవర్ల తరహాలోనే ఆటో కార్మికుల కోసం ఈ కాలనీని అభివృద్ధి చేయనున్నారు. హైదరాబాద్‌తో పాటు పరిసర పట్టణ ప్రాంతాల్లో ఆటోరిక్షా కార్మికులకు ప్రత్యేకంగా ఇళ్ల పథకం చేపట్టాలని తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్, హౌసింగ్ కమిషనర్ ప్రతిపాదించగా.. ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
నగరంలోని నాలుగు దిశల్లో ఇళ్ల నిర్మాణానికి స్థలాలను గుర్తించారు. బండ్లగూడ (ఎల్‌ఐసీ కాలనీ), గంధంగూడ, పేట్‌బషీరాబాద్, జల్‌పల్లి/లక్ష్మీగూడ ప్రాంతాల్లో ఒక్కో చోట 500 చొప్పున ఇళ్లు నిర్మించనున్నారు. మొత్తం 2 వేల ఇళ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఇందిరమ్మ ఇళ్లు-టవర్ల పథకానికి వర్తించే మార్గదర్శకాలు, లబ్ధిదారుల అర్హతలు, ఆర్థిక సాయం, రిజర్వేషన్లు, ఎంపిక, కేటాయింపు విధానాలనే ఈ పథకంలోనూ అనుసరించనున్నారు. అయితే లబ్ధిదారులు తప్పనిసరిగా ఆటోరిక్షా కార్మికులై ఉండాలనే ప్రత్యేక నిబంధన విధించారు.
మరోవైపు, సీర్ ప్రాంతం, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఎల్‌ఐజీ, ఎంఐజీ కేటగిరీల కింద డిమాండ్ సర్వే ఆధారంగా లక్ష సరసమైన ధరల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా సీర్ ప్రాంతంలో పైలట్ ప్రాజెక్టుగా 12 వేల ఇళ్ల నిర్మాణానికీ అనుమతి ఇచ్చింది. ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు కల్పించడం, గుడిసెలు లేని తెలంగాణ లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
రూ.220 కోట్ల అంచనా వ్యయంతో అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. స్థలాల లభ్యత, అనుకూలత, సాంకేతిక సాధ్యాసాధ్యాలను పరిశీలించి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు, ఆర్థిక ప్రతిపాదనలు సమర్పించాలని హౌసింగ్ బోర్డును ఆదేశించింది.