- ఆధార్ స్థితి, జాతీయత ఆధారంగా కేటగిరీ ఎంపికపై సూచనలు
- భారత పౌరులు, ఆధార్ కార్డు కలిగిన ఎన్నారైలు ‘ఇండియన్ నేషనల్స్’ కేటగిరీ
- విదేశీ పౌరులు, ఓసీఐ కార్డుదారులు ‘ఫారిన్ నేషనల్స్’ విభాగం కిందకు
- పాస్‌పోర్టు ఉండి, ఆధార్ కార్డు లేని ఎన్నారైలు ‘ఎన్నారైస్ హేవింగ్ నో ఆధార్’ కేటగిరీ
- జేఈఈ మెయిన్-2027 తొలి విడత పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 22 చివరి తేదీ
జేఈఈ మెయిన్-2027 దరఖాస్తు ప్రక్రియలో ఆధార్ స్థితి, జాతీయత ఆధారంగా ఏ కేటగిరీని ఎంచుకోవాలో జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) స్పష్టత ఇచ్చింది. దేశీయ, విదేశీ అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఎలాంటి పొరపాట్లు చేయకుండా శుక్రవారం మార్గదర్శకాలు విడుదల చేసింది.
భారత పౌరులు, ఆధార్ కార్డు కలిగిన ఎన్నారైలు ‘ఇండియన్ నేషనల్స్’ కేటగిరీని ఎంచుకోవాలని ఎన్‌టీఏ సూచించింది. విదేశీ పౌరులు, ఓసీఐ కార్డుదారులు ‘ఫారిన్ నేషనల్స్’ విభాగాన్ని ఎంపిక చేసుకోవాలి. భారత పాస్‌పోర్టు ఉండి, ఆధార్ కార్డు లేని ఎన్నారైలు ‘ఎన్నారైస్ హేవింగ్ నో ఆధార్’ కేటగిరీని ఎంచుకోవాలని స్పష్టం చేసింది.
మరోవైపు, జేఈఈ మెయిన్-2027 తొలి విడత పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 22 చివరి తేదీ అని ఎన్‌టీఏ మరోసారి గుర్తుచేసింది. ఇప్పటివరకు 5.72 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయని, 4.07 లక్షల మందికి పైగా పరీక్ష రుసుము చెల్లింపు పూర్తి చేశారని వెల్లడించింది. అభ్యర్థులు దరఖాస్తు పూర్తి చేసి, ఫీజు చెల్లించి, కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది.
గుర్తింపు వివరాల్లో తప్పులు తలెత్తకుండా అభ్యర్థులు తమ సొంత డిజిలాకర్, జనపరిచయ్ లేదా ఈ-ప్రమాణ్ (మేరీ పెహచాన్) ఖాతాల ద్వారానే లాగిన్ కావాలని తెలిపింది. దరఖాస్తు నింపే ముందు డిజిలాకర్‌లో రీ-కేవైసీ పూర్తి చేయడం ద్వారా తాజా వివరాలు పొందవచ్చని సూచించింది. దరఖాస్తులో అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ పదో తరగతి సర్టిఫికెట్ లేదా మార్కుల జాబితాలో ఉన్న వివరాలతో సరిపోవాలి. తాజా సమాచారం కోసం ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌ను తరచూ పరిశీలించాలని కోరింది.
దరఖాస్తులో పొరపాట్లు చేసిన అభ్యర్థులకు ఎన్‌టీఏ వెసులుబాటు కల్పించింది. ఇప్పటికే అప్లికేషన్ నంబర్ పొందినా, పరీక్ష రుసుము చెల్లించినా, తొలి విడత కోసం మరో కొత్త దరఖాస్తు సమర్పించేందుకు అనుమతించింది. అయితే కొత్త దరఖాస్తుకు ఫీజు చెల్లించి, కన్ఫర్మేషన్ పేజీ రూపొందించిన చివరి దరఖాస్తునే చెల్లుబాటైనదిగా పరిగణిస్తారు.
కొత్త దరఖాస్తు సమర్పించినప్పటికీ ఫీజు చెల్లించకపోతే, కన్ఫర్మేషన్ పేజీ రూపొందించకపోతే.. అంతకుముందు ఫీజు చెల్లించి కన్ఫర్మేషన్ పేజీ పొందిన దరఖాస్తే చెల్లుబాటవుతుంది. ప్రతి కొత్త దరఖాస్తుకు కొత్త అప్లికేషన్ నంబర్ కేటాయిస్తారు. ఫొటో, సంతకం సహా అన్ని వివరాలు, పత్రాలను మరోసారి నమోదు చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.