- రాష్ట్రంలో 86 రద్దీ బస్ స్టేషన్లలో ఉచిత వైఫై
- ఒక్కో బస్ స్టేషన్‌కు ప్రత్యేక కంట్రోలర్ నియామకం
- బస్సుల వివరాల కోసం ప్రత్యేక ఫోన్ నంబర్లు
- కొత్త టైమ్ టేబుల్ బోర్డుల ఏర్పాటు
- అన్ని బస్ స్టేషన్లలో త్వరలో సీసీ కెమెరాలు
తెలంగాణలోని బస్ స్టేషన్లలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే బస్ స్టేషన్లపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా 5 వేల మందికిపైగా ప్రయాణికుల రద్దీ ఉండే 86 బస్ స్టేషన్లను గుర్తించింది. వీటిలో దశలవారీగా ఉచిత వైఫై సదుపాయం అందుబాటులోకి తీసుకురానుంది.
గుర్తించిన బస్ స్టేషన్లలో ఇప్పటికే ఒక్కో కంట్రోలర్‌ను నియమించింది. ప్రయాణికులు బస్సుల వివరాలు, రాకపోకల సమయాలు తెలుసుకునేందుకు ప్రత్యేక ఫోన్ నంబర్లను ఏర్పాటు చేసింది. కొత్త టైమ్ టేబుల్ బోర్డులను కూడా అందుబాటులోకి తీసుకురానుంది.
ప్రయాణికుల భద్రతతో పాటు బస్ స్టేషన్లలో రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో అన్ని బస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనుంది. వీటిని సంబంధిత ప్రాంతీయ కార్యాలయాలతో పాటు ప్రధాన కార్యాలయానికి అనుసంధానించనున్నారు. తద్వారా బస్ స్టేషన్లలో పరిస్థితులను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించే అవకాశం ఉంటుంది.
బస్ స్టేషన్లలో వసతులను మెరుగుపరచడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. ప్రయాణికుల సౌకర్యాల కల్పనకు సంస్థ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.