- సర్వీస్, సీనియారిటీ అంశాల్లో ఏళ్లుగా అమలుకాని తీర్పులపై పిటిషన్లు
- విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని అధికారులకు కోర్టు ఆదేశం
- తదుపరి విచారణకు అధికారులు వ్యక్తిగతంగా హాజరు కావాలని హైకోర్టు ఆదేశం
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న, పదవీ విరమణ చేసిన పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులపై దాఖలైన కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలపై ఏపీ హైకోర్టు ఈ నెల 13న విచారణ జరపనుంది. ఉద్యోగుల సర్వీసు అంశాల్లో న్యాయస్థానం గతంలో వెలువరించిన తీర్పులను ఉద్దేశపూర్వకంగా అమలు చేయడం లేదంటూ దాఖలైన పలు పిటిషన్లను జస్టిస్ రవినాథ్ తిలహరి, జస్టిస్ ఆలపాటి గిరిధర్లతో కూడిన ధర్మాసనం విచారించనుంది.
ఈ పిటిషన్లను సచివాలయ సిబ్బంది, ఆర్ అండ్ బీ ఇంజనీర్లు, టీటీడీ ఉద్యోగులు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు, పదవీ విరమణ చేసిన పలువురు ఉద్యోగులు దాఖలు చేశారు. సూపర్న్యూమరరీ పోస్టుల కేటాయింపు, అంతర్రాష్ట్ర సీనియారిటీ నిబంధనల అమలు, ఇతర సర్వీసు ప్రయోజనాల కల్పన వంటి అంశాలపై 2018 నుంచి న్యాయస్థానం ఇచ్చిన పలు ఉత్తర్వులను అధికారులు అమలు చేయడం లేదని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు.
అక్టోబర్ 30న జరిగిన విచారణ సందర్భంగా, ఈ కేసును ధర్మాసనం నవంబర్ 13కి వాయిదా వేసింది. ఖాళీల లెక్కింపు, నూతన పోస్టుల సృష్టి, సీనియారిటీ సమస్యల పరిష్కారంలో పరిపాలనాపరమైన చిక్కులు ఉన్నాయని, కోర్టు ఆదేశాల అమలుకు మరికొంత సమయం కావాలని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కోరారు. అయితే, న్యాయస్థానం ఇచ్చిన ప్రధాన ఆదేశాలు ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదని పిటిషనర్లు వాదిస్తున్నారు.
ఈ కేసులో కొత్తగా ప్రతివాదులుగా చేరిన వారు రెండు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని, ఇప్పటికే కౌంటర్లు వేసిన అధికారులు తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ధర్మాసనం తన గత ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.