బంగారం ధరలు బుధవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. మంగళవారం ప్రారంభమైన ఈ క్షీణత నేడు కూడా కొనసాగింది. దీనివల్ల తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు స్వల్పంగా దిగివచ్చాయి.

హైడరాబాద్, విజయవాడ మార్కెట్లలో గుడ్‌ రిటర్న్స్ వెబ్‌సైట్ గణాంకాల ప్రకారం.. బుధవారం ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,30,790గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.1,42,680గా నమోదైంది. అదేవిధంగా 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,07,010 వద్ద కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఇతర ప్రధాన నగరాలైన విశాఖపట్నం, వరంగల్, తిరుపతి, ఖమ్మం, కాకినాడల్లో కూడా ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.

పసిడి బాటలోనే వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండిపై సుమారు రూ.100 మేర తగ్గడంతో ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో కిలో వెండి ధర రూ.2,04,900గా ఉంది.

దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే చెన్నైలో బంగారం ధరలు అత్యధికంగా ఉన్నాయి. అక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,32,110గా పలుకుతోంది. ముంబై, కోల్‌కతా, కేరళలో ధరలు హైదరాబాద్‌తో సమానంగా ఉండగా, ఢిల్లీలో మాత్రం కాస్త ఎక్కువగా ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ విలువ, స్థానిక పన్నుల ప్రాతిపదికన బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు ఆభరణాలు కొనుగోలు చేసే ముందు తాజా ధరలను మరోసారి నిర్ధారించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.