- రైలు ఇంజిన్‌తో పాటు పట్టాలు తప్పిన బోగీలు
- వేగం నియంత్రణ తప్పడంతో పట్టాలు తప్పిన రైలు
- త్రుటిలో తప్పిన ప్రాణనష్టం.. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ రైలు ఏర్పాటు
అసోంలో ఈ ఉదయం ఓ రైలు పట్టాలు తప్పిన ఘటనలో ప్రయాణికులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కోల్‌కతా నుంచి మిజోరాం వెళ్తున్న కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్ 13125) బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
గువాహటి శివార్లలోని కామరూప్ మెట్రోపాలిటన్ జిల్లా పరిధిలో గల దిగారు రైల్వే స్టేషన్ సమీపంలో ఉదయం దాదాపు 6.54 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. మరో రైలుకు మార్గం సుగమం చేసే క్రమంలో కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్‌ను స్టేషన్‌లోకి తీసుకుంటుండగా, లోకో పైలట్ వేగాన్ని నియంత్రించలేకపోయారని రైల్వే వర్గాలు తెలిపాయి. దీని ఫలితంగా ఇంజిన్‌తో పాటు ఐదు బోగీలు పట్టాలు తప్పినట్లు ఈశాన్య సరిహద్దు రైల్వే అధికారిక ప్రకటనలో పేర్కొంది.
అయితే ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు స్పష్టం చేశారు. కొంతమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా, వారికి ప్రాథమిక చికిత్స అందించినట్టు వెల్లడించారు.
ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. రైలులో చిక్కుకున్న ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు అధికారులు వెంటనే ప్రత్యామ్నాయ రైలును సిద్ధం చేశారు. ట్రాక్ పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.