‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’.. రాహుల్ గాంధీ ప్రవర్తనపై వివరణ కోరిన సుప్రీం
- సుప్రీంకోర్టు వరకు ర్యాలీగా వెళ్లి రాహుల్పై సుప్రీం అసహనం
- తన చర్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశం
- న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలను సహించబోమని స్పష్టీకరణ
సుప్రీంకోర్టు వైపు నిరసన ర్యాలీ చేపట్టిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీరుపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ఆయన వివరణ ఇవ్వాల్సిందేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలను సహించబోమని, ఎవరూ న్యాయవ్యవస్థను బెదిరించలేరని వ్యాఖ్యానించారు.
అక్టోబర్ 12న రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమి నేతలు సుప్రీంకోర్టు వైపు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ఎన్నికల సంఘం నిర్ణయాలను వ్యతిరేకిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను తొలగించాలని, ఎస్ఐఆర్ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం రాహుల్ గాంధీ స్వయంగా సుప్రీంకోర్టుకు వెళ్లి, ఈ అంశంపై ఉమ్మడి పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్పై గురువారం విచారణ సందర్భంగా రాహుల్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్తో ప్రధాన న్యాయమూర్తి మాట్లాడారు. ర్యాలీ సందర్భంగా ఏర్పడిన గందరగోళాన్ని ప్రస్తావిస్తూ, రాహుల్ తన చర్యలపై వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు.