- జగ్గారెడ్డి నివాసానికి వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించిన హరీశ్ రావు
- సుమారు 21 ఏళ్ల తర్వాత తొలిసారి ఫ్యామిలీ ఫంక్షన్లో కలిసిన నేతలు
- 2004లో హరీశ్ చాంబర్‌లోనే భోజనం చేసేవాళ్లమని గుర్తుచేసుకున్న జగ్గారెడ్డి
- కూతురి పెళ్లికి పిలవలేకపోయా.. కుమారుడి వేడుకకు పిలిచానన్న కాంగ్రెస్ నేత
- తమ భేటీ వెనుక ఎలాంటి రాజకీయాలు, అంతరార్థాలు లేవని స్పష్టీకరణ
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సంగారెడ్డిలోని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి నివాసానికి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ అగ్రనేత తన్నీరు హరీశ్ రావు విచ్చేశారు. జగ్గారెడ్డి కుమారుడు భరత్ సాయిరెడ్డి, కోడలు పాలక్ పటేల్ నిర్వహించిన సత్యనారాయణ వ్రతం సందర్భంగా వారిని ఆశీర్వదించేందుకు ఆయన నేరుగా జగ్గారెడ్డి ఇంటికి వెళ్లారు. ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉన్న వీరిద్దరూ సుమారు 21 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒకరినొకరు కలుసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఈ సందర్భంగా నూతన దంపతులను ఆశీర్వదించిన అనంతరం జగ్గారెడ్డి, హరీశ్ రావులు కాసేపు ఆప్యాయంగా ముచ్చటించారు. అనంతరం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. 2004లో హరీశ్ రావు తొలిసారి మంత్రిగా ఉన్నప్పుడు తాను ఆయనను కలిసి ఆయన చాంబర్‌లోనే భోజనం చేసేవాళ్లమని గుర్తుచేశారు. ఆ తర్వాత తాను కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు హరీశ్ రావును కలవలేదన్నారు. గత పదేళ్లు హరీశ్ మంత్రిగా, తాను ఎమ్మెల్యేగా కొనసాగినప్పటికీ ఎన్నడూ కలవలేకపోయానని తెలిపారు.
కూతురి పెళ్లికి హరీశ్‌ను పిలవలేకపోయానని, అయితే ఈసారి కుమారుడి వేడుకను మిస్ కావద్దని ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు జగ్గారెడ్డి చెప్పారు. తమ కలయిక వెనుక ఎలాంటి రాజకీయాలు, మతలబులు లేవని స్పష్టం చేశారు. హరీశ్ రావు బీఆర్‌ఎస్‌లో అగ్రనేత అని, తాను కాంగ్రెస్‌లో ఒక స్థాయి నాయకుడినని పేర్కొన్నారు. రాజకీయాలు వేరని, తాము ఎప్పుడూ వ్యక్తిగతంగా విమర్శించుకోలేదని తెలిపారు. హరీశ్ రావు వెంట మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, డీసీఎంఎస్ ఛైర్మన్ శివకుమార్ ఉన్నారు.