- ఇందిరమ్మ బీమాకు ఇంటి పన్ను మెలిక పెట్టిన కార్యదర్శులు
- పన్ను చెల్లిస్తేనే ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్న వైనం
- ఒకే పంచాయతీలో రూ.లక్ష వరకు పన్ను వసూలు
- క్షేత్రస్థాయిలో నిలదీసిన స్థానిక ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు
- బీమాకు పన్నుతో సంబంధం లేదని స్పష్టం చేసిన ఎంపీడీవో
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం’ నమోదు ప్రక్రియ క్షేత్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. బీమా కోసం దరఖాస్తు చేసుకునేందుకు గ్రామ పంచాయతీలకు వెళ్తున్న ప్రజలకు అధికారులు మెలికలు పెడుతున్నారు. పాలకుర్తి మండలంలోని పలు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు పెడుతున్న వింత నిబంధనలతో సామాన్య ప్రజలు రిజిస్ట్రేషన్ చేయించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇంటి పన్ను చెల్లించిన వారి వివరాలను మాత్రమే ఆన్లైన్లో నమోదు చేస్తూ, పన్ను బకాయి ఉన్నవారి దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకానికి ఇంటి పన్నుతో లింకు పెట్టడం ఏంటని పలువురు ప్రజాప్రతినిధులు పంచాయతీ సిబ్బందిని బహిరంగంగానే నిలదీసినా అధికారుల తీరు మారలేదు. పన్ను కడితేనే ఆన్లైన్ చేస్తామంటూ భీష్మించుకు కూర్చున్నారు. ఈ పద్ధతి ద్వారా ఇప్పటికే ఒకే గ్రామ పంచాయతీ పరిధిలో అధికారులు ఏకంగా లక్ష రూపాయల వరకు ఇంటి పన్ను వసూలు చేసినట్లు సమాచారం.
ఈ వ్యవహారం చివరకు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి సైతం వెళ్లిందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. కాగా, ఈ నిబంధనపై పాలకుర్తి ఎంపీడీవో రమేశ్ స్పందించారు. ఇందిరమ్మ బీమా పథకం నమోదుకు, ఇంటి పన్ను వసూళ్లకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సమస్య తన దృష్టికి వచ్చిందని, సంబంధిత గ్రామ పంచాయతీకి వెళ్లి పరిస్థితిని సమీక్షించినట్లు ఆయన వివరణ ఇచ్చారు.