- డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్‌ఎస్ మద్దతివ్వడంపై అద్దంకి దయాకర్ ఆగ్రహం
- దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గించేందుకే బీజేపీ కుట్ర అని విమర్శ
- ఈ అంశంపై మౌనంగా ఉండేందుకు బీఆర్‌ఎస్ అమ్ముడుపోయిందని ఫైర్
దక్షిణ భారతదేశ రాజకీయ ప్రయోజనాలకు నష్టం కలిగించే డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్‌ఎస్ మద్దతు ఇవ్వడం వెనుక బీజేపీతో కుదిరిన చీకటి ఒప్పందమే కారణమని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ రెండు పార్టీల రహస్య బంధం ఈ పరిణామంతో మరోసారి బయటపడిందని ఆయన అన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
దక్షిణాది రాష్ట్రాలతో పనిలేకుండా, కేవలం ఉత్తరాది రాష్ట్రాలపైనే ఆధారపడి రాజకీయాలు చేసేందుకు ప్రధాని మోదీ ప్లాన్ చేస్తున్నారని దయాకర్ విమర్శించారు. దేశాన్ని విభజించే రాజకీయాల్లో భాగంగా బీజేపీ ఇప్పుడు ఉత్తర, దక్షిణ భారత దేశాల మధ్య కూడా చిచ్చు పెడుతోందని ఆయన మండిపడ్డారు.
ఆంధ్రాలో బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీ మద్దతివ్వడంలో అర్థం ఉందని, కానీ జగన్, తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎందుకు మద్దతిస్తున్నట్టు అని దయాకర్ నిలదీశారు. దక్షిణాది రాజకీయ ప్రయోజనాలను కాపాడే బాధ్యత కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉందా, మిగతా పార్టీలకు బాధ్యత లేదా అని ఆయన ప్రశ్నించారు. భవిష్యత్తు రాజకీయ ఒప్పందాలలో భాగంగానే బీఆర్‌ఎస్ ఈ ఎత్తుగడ వేసిందని విమర్శించారు.
బీఆర్‌ఎస్ ఇప్పుడు 'బేస్ లెస్ రాష్ట్ర సమితి'గా మారిపోయిందని దయాకర్ ఎద్దేవా చేశారు. ప్రతీ అంశాన్ని రాజకీయం చేసే ఆ పార్టీ, ఇంత కీలకమైన విషయంలో మౌనంగా ఉండేందుకు ఎంతకు అమ్ముడుపోయిందో చెప్పాలని ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.