- పల్నాడు ప్రాజెక్టు పనులను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామన్న కోమటిరెడ్డి
- నీళ్ల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టీకరణ
- పల్నాడు ప్రాజెక్టు విషయంలో కేంద్రం పునరాలోచించాలని విన్నపం
పల్నాడు ప్రాజెక్టు ద్వారా నీటి తరలింపును ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని... కాబట్టి నీటి హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని అన్నారు.
ప్రాజెక్టు ఎప్పుడు మొదలైందన్నది ప్రస్తుతం ప్రధానం కాదని, తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు దానిని అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని కోమటిరెడ్డి పేర్కొన్నారు. పల్నాడు ప్రాజెక్టు పనుల పురోగతికి సంబంధించి ప్రభుత్వానికి సమయానికి సమాచారం ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం వహించారని, వారి అలసత్వం వల్లే ప్రాజెక్టు పనులు ముందుకు సాగాయని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పైన ఉన్న నీటిని ఎక్కువగా చూపించి, నీటిని తరలించుకుపోవడం సరికాదని అన్నారు.
ఈ విషయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు అనవసర రాజకీయ విమర్శలు మానుకోవాలని మంత్రి హితవు పలికారు. ప్రాంతీయ ప్రయోజనాల పరిరక్షణ కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు వచ్చి, ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
మరోవైపు, పల్నాడు ప్రాజెక్టు నిర్మాణం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతోందని కోమటిరెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించే ఈ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలని, నిధుల కేటాయింపు, ప్రాజెక్టు నిర్మాణంపై పునరాలోచన చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నాగార్జునసాగర్ పరిధిలో రాష్ట్ర నీటి ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు.