ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి
Add ap7am to your home Screen

ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి

Nana Patekar passes away Pawan Kalyan expresses deep shock
  • గోవాలో గుండెపోటుతో కన్నుమూసిన నానా పటేకర్
  • 'క్రాంతివీర్'లో ఆయన నటన మరచిపోలేనిదన్న పవన్
  • సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి వెల్లువెత్తుతున్న సంతాపాలు
ప్రముఖ బాలీవుడ్ నటుడు, విలక్షణ నటనకు పేరుగాంచిన నానా పటేకర్ (75) కన్నుమూశారు. గోవాలోని డోనా పౌలాలో ఉన్న తన నివాసంలో ఈ తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు.తెల్లవారుజామున నానా పటేకర్ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. సుమారు 45 నిమిషాల పాటు వైద్యులు సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఉదయం 5.20 గంటలకు ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన ఆకస్మిక మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

పవన్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ... "ప్రముఖ నటులు నానా పటేకర్ గారు ఆకస్మిక మరణ వార్త తెలిసి చింతిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఎటువంటి పాత్రలోనైనా ఒదిగిపోయే నటుడు నానా పటేకర్ గారు. 'క్రాంతివీర్' చిత్రంలో ఆయన నటన మరచిపోలేనిది. పరిందా, ఖామోషీ, తిరంగా, అగ్నిసాక్షి, నటసామ్రాట్, అబ్ తక్ చప్పన్, అపహరణ్ లాంటి చిత్రాలు నానా పటేకర్ గారి నట జీవితంలో కొన్ని మచ్చు తునకలు. భారత సైన్యంలోనూ గౌరవపూర్వక సేవలందించారు. నానా పటేకర్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను," అని పేర్కొన్నారు.

దాదాపు ఐదు దశాబ్దాల పాటు హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమలో తన అద్భుత నటనతో నానా పటేకర్ చెరగని ముద్ర వేశారు. ఆయన పద్మశ్రీతో పాటు మూడు జాతీయ అవార్డులను అందుకున్నారు. నానా పటేకర్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Advertisement
Nana Patekar
Pawan Kalyan
Bollywood Actor Death
Nana Patekar Heart Attack
National Award Winner
Goa

More Telugu News