- మంగళగిరి జనసేన కార్యాలయం పేరుతో రూ.7 కోట్ల మోసం
- ఏలూరు, తణుకు ప్రాంతాలకు చెందిన దాదాపు 20 మంది బాధితుల నుంచి వసూళ్లు
- మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన జనసేన కీలక నేతలు
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం పేరు చెప్పి అమాయకులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీ మోసానికి పాల్పడిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. పార్టీ పేరు, గుర్తులు, అలాగే సీనియర్ నేతల పేర్లను అడ్డం పెట్టుకుని ఓ కేటుగాడు నిరుద్యోగుల నుంచి ఏకంగా రూ.7 కోట్ల మేర వసూలు చేశాడు. ఈ వ్యవహారంపై జనసేన పార్టీ నాయకత్వం తీవ్రంగా స్పందించింది.
ఈ మోసానికి సంబంధించి జనసేన సీనియర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాసరావు, జనసేన సెంట్రల్ అఫైర్స్ కమిటీ వైస్ చైర్మన్ కోట రుక్మిణి గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఏలూరు, తణుకు ప్రాంతాలకు చెందిన దాదాపు 20 మంది బాధితుల నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నిందితుడు ఈ భారీ మొత్తాన్ని వసూలు చేసినట్లు సమాచారం. డబ్బులు చేతికి అందాక సదరు వ్యక్తి బాధితులకు ముఖం చాటేసి పరారైనట్లు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర కార్యాలయం ప్రతిష్ఠను, ముఖ్య నేతల పేర్లను వాడుకుంటూ నిరుద్యోగులను నిలువునా ముంచిన ఈ ఘటన పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
అమాయక ప్రజలను మోసగించి పార్టీ పేరును చెడగొట్టేలా వ్యవహరించిన సదరు కేటుగాడిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు పోలీసులను కోరారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.