- పర్యాటక రంగాన్ని రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజన్‌గా మారుస్తున్నామన్న కందుల దుర్గేశ్
- రూ.442.92 కోట్ల పెట్టుబడులతో మూడు స్టార్ హోటళ్లు రాబోతున్నాయని వెల్లడి
- టూరిజం రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామన్న మంత్రి
ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగాన్ని రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ప్రధాన ‘గ్రోత్ ఇంజన్’గా తీర్చిదిద్దుతున్నామని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు. విశాఖలో జరుగుతున్న పెట్టుబడుల సదస్సులో ప్రముఖ ఆతిథ్య రంగ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని నెల్లూరు, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో మొత్తం రూ.442.92 కోట్ల భారీ పెట్టుబడులతో మూడు నూతన స్టార్ హోటళ్లు ఏర్పాటు కానున్నాయని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టుల వివరాలను వెల్లడిస్తూ, నెల్లూరులో డీఎస్ఆర్ హాస్పిటాలిటీ సర్వీసెస్ సంస్థ రూ.139.92 కోట్ల వ్యయంతో 123 గదుల అత్యాధునిక హోటల్‌ను నిర్మించనుందని మంత్రి తెలిపారు. అలాగే, పర్యాటక రాజధాని విశాఖపట్నంలో రూ.115 కోట్ల పెట్టుబడితో 98 గదుల సామర్థ్యంతో ‘ది పార్క్ హోటల్స్’ ప్రాజెక్ట్ రానుందని చెప్పారు. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి సమీపంలోని రేణిగుంట వద్ద రూ.188 కోట్లతో గ్రాండ్ తిరుపతి హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నూతన స్టార్ హోటల్‌ను నెలకొల్పనున్నట్లు వివరించారు.
రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని వేగంగా విస్తరించేందుకు ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని, ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక నగరాల్లో అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దుర్గేశ్ స్పష్టం చేశారు. ఈ భాగస్వామ్యాల ద్వారా పర్యాటక మౌలిక సదుపాయాలు బలోపేతం కావడమే కాకుండా, స్థానికంగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.