- పంచాయతీ ఎన్నికల్లో పోటీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
- పార్టీ శ్రేణులు ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్లు వేయవచ్చని స్పష్టీకరణ
- పోటీ చేయాలనుకునే వారిని నాయకులు ఎవరూ అడ్డుకోవద్దని ఆదేశం
- పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి సీట్ల పంపకాలు ఉండవని వెల్లడి
- స్థానిక సంస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఎన్నికలు జరగాలని పిలుపు
ఆంధ్రప్రదేశ్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన పార్టీ శ్రేణులకు ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఎవరైనా ఎలాంటి రాజకీయపరమైన అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసి ఎన్నికల బరిలో నిలవవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకొచ్చే జనసేన శ్రేణులను పార్టీలోని నాయకులు ఎవరూ అడ్డుకోకూడదని పవన్ కల్యాణ్ కరాఖండిగా ఆదేశాలు జారీ చేశారు. స్థానిక స్థాయిలో ప్రజాసేవ చేయాలనే ఆసక్తి, ప్రజల మద్దతు ఉన్న ప్రతి ఒక్కరికీ అవకాశం దక్కాలన్నదే తమ విధానమని పేర్కొన్నారు.
మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తరహాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి స్థానాల పంపకాలు (సీట్ల సర్దుబాటు) ఉండవని పవన్ కల్యాణ్ తేల్చిచెప్పారు. పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు అతీతంగా, స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో జరిగే ఎన్నికలని ఆయన గుర్తుచేశారు. ఈ క్రమంలో పోటీ చేయాలనుకునే ప్రతి పౌరుడికి నామినేషన్ దాఖలు చేసే పూర్తి హక్కు ఉంటుందన్నారు.
జనసేన పార్టీ ఎల్లప్పుడూ ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తుందని, రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి స్వేచ్ఛాపూరిత వాతావరణంలో, నిష్పక్షపాతంగా జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేందుకు పార్టీ శ్రేణులు బాధ్యతాయుతంగా ముందుకు సాగాలని సూచించారు.