- జనసేన తీర్థం పుచ్చుకున్న అనంత శ్రీరామ్ తల్లిదండ్రులు వీర వెంకట సత్యనారాయణమూర్తి, ఉమారాణి
- భీమవరంలో కండువాలు కప్పి ఆహ్వానించిన జిల్లా అధ్యక్షుడు గోవిందరావు
- దొడ్డిపట్ల సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన అనంత శ్రీరామ్ తల్లి ఉమారాణి
- గ్రామాభివృద్ధిపై పవన్ కల్యాణ్ నిబద్ధత నచ్చే పార్టీలో చేరామని వెల్లడి
ప్రముఖ సినీ గీత రచయిత అనంత శ్రీరామ్ కుటుంబం రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఆయన తల్లిదండ్రులు చేగొండి వీర వెంకట సత్యనారాయణమూర్తి, చేగొండి ఉమారాణి నేడు అధికారికంగా జనసేన పార్టీలో చేరారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జనసేన జిల్లా అధ్యక్షుడు కె. గోవిందరావు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకొల్లు నియోజకవర్గ పరిధిలోని యలమంచిలి మండలం, దొడ్డిపట్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా అనంత శ్రీరామ్ తల్లి చేగొండి ఉమారాణి పోటీ చేస్తున్నారు.
ఈ సందర్భంగా గేయ రచయిత అనంత శ్రీరామ్ మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ, తీసుకుంటున్న చర్యలు తమను ఎంతగానో ప్రభావితం చేశాయని తెలిపారు. పల్లెల ప్రగతే ధ్యేయంగా పవన్ కల్యాణ్ చేస్తున్న పనులకు ఆకర్షితులై తన తల్లిదండ్రులు జనసేన పార్టీలో చేరారని స్పష్టం చేశారు. సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న ఉమారాణి కూడా పవన్ కల్యాణ్ పనితీరు, గ్రామాల పట్ల ఆయనకున్న విజన్‌ను కొనియాడారు. ప్రజలకు మరింత చేరువై సేవ చేసేందుకే తాము జనసేనతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నామని ఆమె పేర్కొన్నారు.