- కూటమిని విచ్ఛిన్నం చేసేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయన్న నాగబాబు
- కూటమిలోని పార్టీలది ఒకే మాట, ఒకే బాట అని స్పష్టీకరణ
- రాష్ట్రాభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన అజెండా అని వెల్లడి
జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అత్యంత పటిష్టంగా ఉందని ఏపీ గ్రీన్ ఆంధ్ర చైర్మన్, జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు స్పష్టం చేశారు. ఈ కూటమిని విచ్ఛిన్నం చేయడానికి ప్రతిపక్షాలు రకరకాల కుట్రలు చేస్తున్నాయని, వాటిని మూడు పార్టీలు ఐక్యంగా ఎదుర్కొని తిప్పికొడతాయని ఆయన తేల్చిచెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఎన్నికల ప్రచార నిమిత్తం వచ్చిన ఆయన... ప్రత్తిపాడులో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ... కూటమి విడిపోయే ప్రసక్తే లేదని అన్నారు. కూటమిలోని మూడు పార్టీలది ఒకే మాట, ఒకే బాట అని స్పష్టం చేశారు. సీట్ల సర్దుబాటులో చిన్నచిన్న మనస్పర్ధలు రావడం సహజమేనని... పంచాయతీ ఎన్నికల తర్వాత అన్నీ సర్దుకుంటాయని తెలిపారు. రాష్ట్రాభివృద్ధే అజెండాగా అందరం కలిసి పని చేస్తామని చెప్పారు. వైసీపీ రాక్షస పాలన మళ్లీ రాకూడదనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. రాబోయే రోజుల్లోనూ కూటమిని మరింత బలోపేతం చేసుకుంటూ ప్రజల్లోకి వెళతామన్నారు.