రోజూ నెయ్యి.. గుండెకు మంచిదా? చెడ్డదా? అసలు నిజం ఇదే!

రోజూ నెయ్యి.. గుండెకు మంచిదా? చెడ్డదా? అసలు నిజం ఇదే!

Ghee daily intake is it good or bad for heart health
  • నెయ్యిలో శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ ఎక్కువ
  • మోతాదుకు మించి తీసుకోవడం మంచిది కాదంటున్న నిపుణులు
  • అధిక శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌తో కొలెస్ట్రాల్‌ను పెరిగే ఛాన్స్‌
  • కొలెస్ట్రాల్‌ పెరిగితే గుండె జబ్బుల ముప్పు పెరగొచ్చని హెచ్చరిక
  • ఆరోగ్యవంతులు రోజుకు 1-2 టీస్పూన్లు తీసుకోవచ్చని సూచన
వేడి వేడి అన్నంలో ఓ చెంచా నెయ్యి.. పప్పులో కాస్త నెయ్యి.. రోటీపై మరికాస్త నెయ్యి! ఇలా భారతీయ వంటింట్లో నెయ్యికి ఉన్న ప్రత్యేకతే వేరు. పెద్దలు దీన్ని ఆరోగ్యానికి చాలా మంచిదంటుంటారు. పిల్లలకు పెడితే బలమంటారు. రుచికి కూడా తిరుగుండదు. అయితే ఇంతగా ఇష్టపడే నెయ్యిని మోతాదుకు మించి తీసుకుంటే గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా? వైద్య నిపుణులు ఏమంటున్నారో చూద్దాం..

మోతాదే అసలు విషయం
నెయ్యిలో శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ ఎక్కువగా ఉంటాయి. 100 గ్రాముల నెయ్యిలో దాదాపు 883 కిలోకేలరీలు ఉంటాయి. అందుకే నెయ్యి తినడం వల్ల సమస్య వస్తుందని కాదు. ఎంత మోతాదులో తీసుకుంటున్నామన్నదే ముఖ్యం.

పప్పుకు ఓ చెంచా.. అన్నానికి మరో చెంచా.. రోటీకి ఇంకో చెంచా. ఇలా రోజంతా తెలియకుండానే నెయ్యి పరిమాణం పెరిగిపోవచ్చు. అదే అలవాటు కొనసాగితే శరీరంలోకి అవసరానికి మించిన కొవ్వు చేరుతుంది.

గుండెపై ఎలా ప్రభావం?
శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయులు పెరిగే అవకాశం ఉంది. కొలెస్ట్రాల్‌ ఎక్కువ కాలం అధికంగా ఉంటే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇది గుండె జబ్బుల ముప్పును పెంచొచ్చు.

భారతీయుల్లో బయటకు సన్నగా కనిపించినా శరీరంలో కొవ్వు పేరుకుపోయే విధానం భిన్నంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆహారంలో కొవ్వుల పరిమాణంపై మరింత శ్రద్ధ అవసరం.

రోజుకు ఎంత నెయ్యి?
ఆరోగ్యంగా ఉన్న పెద్దలు రోజుకు ఒకటి నుంచి రెండు టీస్పూన్ల నెయ్యిని మితంగా తీసుకోవచ్చు. అయితే నెయ్యితో పాటు వంట నూనెలు, వెన్న వంటి అన్ని కొవ్వుల పరిమాణాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలి.

ఇప్పటికే గుండె జబ్బులు, మధుమేహం లేదా అధిక కొలెస్ట్రాల్‌ ఉన్నవారు నెయ్యి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వారి ఆహారంలో కొవ్వుల పరిమాణాన్ని వైద్యుడు లేదా పోషకాహార నిపుణుడి సూచన మేరకు నిర్ణయించుకోవడం మంచిది.

చెంచాతో కొలిస్తే చాలు
నెయ్యిని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. వంటలో అంచనా వేసి పోయడం కాకుండా చెంచాతో మోతాదు చూసుకుని వాడటం అలవాటు చేసుకోవాలి. వంట చివర్లో కొద్దిగా నెయ్యి వేసినా మంచి రుచి, వాసన వస్తాయి.
Advertisement
Ghee
Heart health
Cholesterol levels
Saturated fats
Healthy diet
Nutrition tips

More Telugu News