- ఇండోనేషియాలోని ఆచేలో నలుగురు ప్రేమికులు, ఇద్దరు జూదరులకు బహిరంగ శిక్ష
- బహిరంగంగా ప్రేమను ప్రదర్శించారంటూ కొరడా దెబ్బలు
- తీవ్ర నొప్పితో కిందపడిపోవడంతో ఓ బాధితురాలిని పైకి లేపిన సహాయకులు
- మనుషులను దిగజార్చేలా ఉన్నాయంటూ మానవ హక్కుల సంఘాల తీవ్ర నిరసన
- నేరాల నియంత్రణ కోసమే షరియా శిక్షలంటూ సమర్థించుకున్న స్థానిక పాలకులు
ఇండోనేషియాలోని ఆచే ప్రావిన్స్‌లో కఠినమైన షరియా చట్టాల అమలు మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. బహిరంగంగా ప్రేమను ప్రదర్శించారన్న (Public Display of Affection) కారణంతో గురువారం (12 నవంబర్ 2026) బాందా ఆచే నగరంలో ఓ మహిళ సహా పలువురికి బహిరంగంగా కొరడా దెబ్బల శిక్ష అమలు చేశారు. శిక్ష అమలు సమయంలో తీవ్రమైన నొప్పితో నిలబడలేక కింద పడిపోయిన ఆ మహిళను చివరకు సహాయకులు పట్టుకుని లేపాల్సి వచ్చింది.
ఈ కార్యక్రమంలో మొత్తం ఆరుగురికి బహిరంగంగా కొరడా దెబ్బల శిక్ష విధించారు. వీరిలో నలుగురు బహిరంగంగా ప్రేమను వ్యక్తపరిచినందుకు శిక్షకు గురికాగా, మరో ఇద్దరు జూదం ఆడినందుకు శిక్షను ఎదుర్కొన్నారు. నేరాల తీవ్రత ఆధారంగా వారికి 9 నుంచి 22 వరకు కొరడా దెబ్బలు కొట్టారు. తెల్లటి దుస్తులు ధరించిన ఓ మహిళను మోకాళ్లపై కూర్చోబెట్టి, ముఖానికి ముసుగు ధరించిన అధికారి (అల్గోజో) ఆమె వీపుపై కొరడాతో బలంగా బాదారు. దెబ్బల ధాటికి ఆమె నొప్పితో తీవ్రంగా విలవిల్లాడిపోయింది. శిక్ష ముగిసిన తర్వాత ఆమె నడవలేని స్థితికి చేరడంతో సిబ్బంది ఆమెను పట్టుకుని తీసుకెళ్లారు. ఇదే కేసులో శిక్ష పడిన మరో వ్యక్తి కూడా కొరడా దెబ్బలకు విపరీతమైన వేదనను అనుభవించాడు.
ముస్లిం మెజారిటీ ఉన్న ఇండోనేషియాలో ఇస్లామిక్ చట్టాన్ని (షరియా) అమలు చేస్తున్న ఏకైక ప్రావిన్స్ ఆచే మాత్రమే. ఇక్కడ మద్యం సేవించడం, జూదం ఆడటం, స్వలింగ సంపర్కం, వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం, అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశాల్లో సన్నిహితంగా ప్రవర్తించడం వంటి చర్యలను చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు. స్థానిక మసీదుల వెలుపల లేదా ప్రధాన కూడళ్లలో ప్రజలు చూస్తుండగానే ఈ శిక్షలను అమలు చేస్తారు. అక్కడకు గుమిగూడిన ప్రజలు ఆ దృశ్యాలను తమ ఫోన్లలో చిత్రీకరిస్తుంటారు. శారీరక బాధతో పాటు నిందితులను నలుగురిలో అవమానించడమే లక్ష్యంగా ఈ శిక్షల ప్రక్రియ సాగుతుంది.
ఈ బహిరంగ శిక్షా విధానంపై అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి సంస్థలు ఈ చర్యలను క్రూరమైనవిగా, అమానవీయమైనవిగా అభివర్ణించాయి. ఈ శిక్షలు ఇండోనేషియా రాజ్యాంగానికే కాకుండా, ఐక్యరాజ్యసమితి టార్చర్ వ్యతిరేక ఒప్పందాలకు కూడా విరుద్ధమని స్పష్టం చేశాయి. అయితే, నేరాలు పునరావృతం కాకుండా భయం కలిగించేందుకే ఈ శిక్షలు వేస్తున్నామని, ఇది తమ ప్రాంతీయ గుర్తింపులో భాగమని స్థానిక అధికారులు వాదిస్తున్నారు.
ఆచే ప్రావిన్స్‌లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుంటాయి. గత ఆగస్టు నెలలో ఓ వ్యక్తితో కలిసి టిక్‌టాక్ లైవ్‌లో అసభ్యంగా ప్రవర్తించిందన్న ఆరోపణలతో ఓ మహిళకు కొరడా దెబ్బల శిక్ష విధించారు. అలాగే సెప్టెంబర్‌లో వివాహేతర సంబంధం నేరానికి గాను ఓ జంటకు 100 కొరడా దెబ్బలు కొట్టారు. ఆ సమయంలో మహిళ స్పృహతప్పి పడిపోగా, పురుషుడి ఆరోగ్యం క్షీణించడంతో కొద్దిసేపు ఆపి వైద్య పరీక్షల అనంతరం మిగిలిన శిక్షను పూర్తి చేశారు. తాజాగా జరిగిన ఘటనతో ఆచేలో అమలవుతున్న షరియా చట్టాలపై మరోసారి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.