- టెస్ట్ అరంగేట్రంలోనే 7 వికెట్లతో చెలరేగిన సాకిబ్ ఖాన్
- 404/4 స్కోరు నుంచి 446 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక
- కేవలం 42 పరుగుల వ్యవధిలోనే ఆరు వికెట్లు కోల్పోయిన లంక
- రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 57 పరుగులు చేసిన పాకిస్థాన్
- ప్రస్తుతం 45 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్న పాక్ జట్టు
రావల్పిండి వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్థాన్ జట్టు గట్టి పునరాగమనం చేసింది. వర్షం ప్రభావం చూపిన నాలుగో రోజు ఆటలో అరంగేట్ర పేసర్ సాకిబ్ ఖాన్ (7 వికెట్లు) అద్భుత బౌలింగ్‌తో శ్రీలంకను కట్టడి చేశాడు. దాంతో పాకిస్థాన్ జట్టు మ్యాచ్‌పై పట్టు సాధించే దిశగా అడుగులు వేసింది.
31 ఏళ్ల కుడిచేతి వాటం సీమర్ సాకిబ్ ఖాన్, టెస్ట్ అరంగేట్రంలోనే ఒకే ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టిన నాలుగో పాకిస్థాన్ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. గతంలో మొహమ్మద్ నజీర్, మొహమ్మద్ జాహిద్, అబ్రార్ అహ్మద్ మాత్రమే పాకిస్థాన్ తరఫున ఈ ఘనత సాధించారు.
నాలుగో రోజు ఆట ప్రారంభమయ్యే సమయానికి శ్రీలంక 404/4తో పటిష్ఠ స్థితిలో ఉంది. అయితే సాకిబ్ ఖాన్ మేఘావృతమైన వాతావరణాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. ఆఫ్ స్టంప్ లైన్‌పై అద్భుతమైన అవుట్స్వింగర్లతో లంక బ్యాటర్లను బోల్తా కొట్టించాడు. ఎనిమిది ఓవర్ల వ్యవధిలోనే కేవలం 25 పరుగులిచ్చి 5 కీలక వికెట్లు తీశాడు. డబుల్ సెంచరీ దిశగా సాగుతున్న ధనంజయ డి సిల్వా (167)ను తొలి ఓవర్లోనే అవుట్ చేసి, 249 పరుగుల భారీ ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెరదించాడు.
అనంతరం సెంచరీ వీరుడు కుశాల్ మెండిస్ (119), సోనల్ దినూష (20), అసిత ఫెర్నాండోలను పెవిలియన్‌కు పంపాడు. చివరి వికెట్‌గా మిలన్ రత్నాయకేను రజావుల్లా ఔట్ చేయడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 446 పరుగుల వద్ద ముగిసింది. పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 434/9 డిక్లేర్డ్ కాగా, శ్రీలంకకు కేవలం 12 పరుగుల స్వల్ప ఆధిక్యం మాత్రమే లభించింది. లంక జట్టు చివరి ఆరు వికెట్లను కేవలం 42 పరుగుల వ్యవధిలోనే కోల్పోవడం గమనార్హం.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్థాన్, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 21.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది. దీంతో పాక్ ప్రస్తుతం 45 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఓపెనర్ తయ్యబ్ ఆరిఫ్ 11 పరుగుల వద్ద అసిత ఫెర్నాండో బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. క్రీజులో అజాన్ అవైస్ (22 నాటౌట్), మొహమ్మద్ తాహా (24 నాటౌట్) ఉన్నారు. వెలుతురు మందగించడం, వర్షం మొదలవడంతో మధ్యాహ్నం 3:05 గంటలకే ఆటను నిలిపివేశారు.
మ్యాచ్ అనంతరం సాకిబ్ ఖాన్ మాట్లాడుతూ.. అవుట్‌స్వింగ్ వేయడమే తన బలమని, ఆఫ్ స్టంప్ లైన్‌పై బంతులు వేస్తూ ఉంటే వికెట్లు అవే వస్తాయని కోచ్ మైక్ హెస్సన్ సూచించారని చెప్పాడు. ప్రస్తుతం చేతిలో 9 వికెట్లు ఉండటంతో, ఐదో రోజు ఆటలో పాకిస్థాన్ తమ ఆధిక్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించనుంది. అయితే ఆఖరి రోజు కూడా వర్షం పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.