- తరచూ ఎసిడిటీ వస్తే కారణాన్ని గుర్తించడం అవసరం
- జీఈఆర్డీ, గ్యాస్ట్రైటిస్, అల్సర్లు కూడా కారణం కావచ్చంటున్న నిపుణులు
- వారానికి రెండు మూడు సార్లకు మించి సమస్య వస్తే వైద్య సలహా తప్పనిసరి
- రక్తవాంతులు, నల్లటి మలం, బరువు తగ్గడం హెచ్చరిక సంకేతాలు
- ఛాతీనొప్పిని ఎసిడిటీగా భావించి నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం
భోజనం చేసిన తర్వాత కడుపులో మంట.. కాసేపటికే తేన్పులు.. ఒక్కోసారి ఛాతీలో మంట, కడుపు ఉబ్బరం.. ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు చాలామంది పెద్దగా పట్టించుకోరు. ఏదో ఒక ఆహారం పడలేదనో, సమయానికి తినకపోవడం వల్లనో వచ్చి ఉంటుందని భావిస్తారు. వెంటనే ఉపశమనం కోసం యాంటాసిడ్ మాత్రలు, సిరప్లు వాడుతుంటారు. కొందరైతే ఇంట్లోనే చిట్కాలతో సరిపెట్టుకుంటారు. అప్పుడప్పుడు ఇలా జరగడం పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ తరచూ ఇదే పరిస్థితి ఎదురైతే మాత్రం అప్రమత్తం కావాలి. ఎందుకంటే ఎసిడిటీ, అజీర్తి పేరుతో కనిపించే లక్షణాల వెనుక ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉండొచ్చు. కొన్నిసార్లు గుండెపోటు లక్షణాలు కూడా అజీర్తిలా అనిపించవచ్చు.
ప్రతి కడుపు మంటా సాధారణ సమస్య కాదు
ఎసిడిటీ, అజీర్తి అనేవి ప్రత్యేక వ్యాధుల పేర్లు కాదు. జీర్ణవ్యవస్థలో తలెత్తే అసౌకర్యాలను వివరించడానికి ఉపయోగించే పదాలు. కడుపులోని ఆమ్లాలు ఆహార నాళంలోకి తిరిగి వచ్చినప్పుడు ఛాతీలో మంట కలుగుతుంది. దీన్నే యాసిడ్ రిఫ్లక్స్ అంటారు. అజీర్తి సమస్యలో పై కడుపులో నొప్పి, ఉబ్బరం, వికారం, తరచూ తేన్పులు, కొద్దిగా తిన్నా కడుపు నిండిన భావన కనిపించవచ్చు.
అతిగా తినడం, భోజన వేళలు పాటించకపోవడం, మసాలా లేదా కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, టీ, కాఫీలు అధికంగా తాగడం వంటి అలవాట్లు ఈ సమస్యలకు కారణం కావచ్చు. పొగతాగడం, మద్యం సేవించడం కూడా ప్రభావం చూపుతాయి. ఒత్తిడి, నిద్రలేమి వల్ల లక్షణాలు మరింత ఎక్కువ కావచ్చు. అయితే తరచూ ఎసిడిటీ రావడం గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లక్స్ వ్యాధి (జీఈఆర్డీ)కి సంకేతం కావచ్చు. కడుపులో మంట, నొప్పి కొనసాగితే గ్యాస్ట్రైటిస్ లేదా అల్సర్ వంటి సమస్యలూ ఉండొచ్చు. కారణం తెలుసుకోకుండా పదేపదే మందులు వాడటం వల్ల అసలు సమస్య గుర్తించడం ఆలస్యమవుతుంది.
ఈ పరిస్థితుల్లో వైద్యుడిని సంప్రదించాలి
ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకున్నా వారం రోజులకు మించి సమస్య కొనసాగితే వైద్యుడిని కలవాలి. వారంలో రెండు మూడు సార్లకు మించి ఎసిడిటీ లేదా అజీర్తి వేధించినా నిర్లక్ష్యం చేయకూడదు. గతంలో కంటే మంట, నొప్పి ఎక్కువ కావడం.. సాధారణంగా వాడే మందులతో ఉపశమనం లభించకపోవడం కూడా వైద్య పరీక్షలు అవసరమని సూచించే లక్షణాలే. 45-50 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఇలాంటి సమస్యలు మొదలైనా వైద్య సలహా తీసుకోవాలి. కుటుంబంలో జీర్ణవ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్ల చరిత్ర ఉన్నవారికి కొత్తగా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మరింత జాగ్రత్త అవసరం. నొప్పి నివారణ మందులు, ఆస్పిరిన్, స్టెరాయిడ్లు క్రమం తప్పకుండా వాడేవారిలో కడుపు గోడకు చికాకు, అల్సర్లు, జీర్ణవ్యవస్థలో రక్తస్రావం ముప్పు పెరగవచ్చు. పొగతాగడం, మద్యం సేవించే అలవాట్లతో పాటు జీర్ణ సమస్యలు ఉంటే వైద్యుడి దృష్టికి తీసుకెళ్లాలి.
ఈ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం వద్దు
ఆహారం మింగేటప్పుడు ఇబ్బంది లేదా నొప్పి, పదేపదే వాంతులు, వాంతుల్లో రక్తం, మలంలో రక్తం కనిపించడం, నల్లగా తారులా ఉండే మలం రావడం వంటి లక్షణాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. కారణం తెలియకుండా బరువు తగ్గడం, ఆకలి మందగించడం, రక్తహీనత కూడా హెచ్చరిక సంకేతాలే. జీర్ణవ్యవస్థలో నెమ్మదిగా రక్తస్రావం జరిగినప్పుడు రక్తహీనత ఏర్పడే అవకాశం ఉంది. సమస్య తీవ్రత, వైద్య చరిత్రను బట్టి వైద్యులు రక్తపరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కాన్, ఎండోస్కోపీ వంటి పరీక్షలను సూచించవచ్చు. ఎండోస్కోపీ ద్వారా ఆహారనాళం, కడుపు, చిన్నపేగు మొదటి భాగాన్ని పరిశీలించి వాపు, అల్సర్లు, రక్తస్రావం లేదా అసాధారణ పెరుగుదలలు ఉన్నాయా? అనేది గుర్తించవచ్చు.
గుండెపోటును ఎసిడిటీగా పొరబడొద్దు
ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అంశం ఒకటుంది. గుండెకు సంబంధించిన నొప్పి కూడా కొన్నిసార్లు అజీర్తి లేదా ఎసిడిటీలా అనిపించవచ్చు. గుండెపోటు వచ్చినప్పుడు ఛాతీతో పాటు పై కడుపులోనూ మంట, అసౌకర్యం కలగవచ్చు. దీంతో కొందరు దాన్ని సాధారణ జీర్ణ సమస్యగా భావించే ప్రమాదం ఉంది. ఛాతీలో నొప్పి లేదా అసౌకర్యంతో పాటు చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వికారం, తల తిరగడం కనిపిస్తే వెంటనే అత్యవసర వైద్యసాయం పొందాలి. నొప్పి ఎడమ చేయి, భుజం, వీపు లేదా దవడకు పాకినా ఆలస్యం చేయకూడదు. యాంటాసిడ్ వేసుకుని తగ్గుతుందేమోనని ఎదురుచూడటం ప్రమాదకరం. గుండెపోటు విషయంలో సకాలంలో చికిత్స అందడం ప్రాణాలను కాపాడుతుంది.
ఉపశమనం కోసం వేసుకునే మందులే సమస్య కావచ్చు!
యాంటాసిడ్లు, కడుపులో ఆమ్లాల ఉత్పత్తిని తగ్గించే మందులు అవసరమైనప్పుడు ఉపశమనం కలిగిస్తాయి. కానీ వైద్యుల సలహా లేకుండా దీర్ఘకాలం వాడటం మంచిది కాదు. ఇవి అసలు వ్యాధి లక్షణాలను తాత్కాలికంగా తగ్గించి, సమస్యను గుర్తించడంలో జాప్యం కలిగించవచ్చు.
చిన్న మార్పులతో జీర్ణవ్యవస్థకు మేలు
అప్పుడప్పుడు వచ్చే ఎసిడిటీ, అజీర్తిని తగ్గించుకోవడానికి కొన్ని అలవాట్లు తోడ్పడతాయి. ఒకేసారి ఎక్కువగా తినకుండా కొద్దికొద్దిగా ఆహారం తీసుకోవాలి. రాత్రి భోజనం ఆలస్యం చేయకూడదు. ఏ ఆహారం తిన్నప్పుడు మంట పెరుగుతోందో గుర్తించి దానికి దూరంగా ఉండాలి. మద్యం తగ్గించడం, పొగతాగడం మానేయడం, ఆరోగ్యకరమైన బరువును కొనసాగించడం మంచిది. భోజనం చేసిన వెంటనే పడుకోకుండా ఉండాలి.
గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. వైద్యుల సలహాలకు ప్రత్యామ్నాయంగా భావించొద్దు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా డాక్టర్లను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి.