- పదేళ్లలో క్యాన్సర్ సహా పలు వ్యాధులు గత చరిత్రగా మారతాయన్న ఆంథ్రోపిక్ సీఈఓ
- వైద్య పరిశోధనల్లో ఏఐ కీలక మార్పులు తెస్తుందని అంచనా
- ఆల్ఫాఫోల్డ్ విజయాన్ని ఉదాహరణగా చూపుతున్న ఏఐ నిపుణులు
- ఏఐ సంస్థల అంచనాలపై ఔషధ రంగ నిపుణుల సందేహాలు
- కొత్త ఔషధానికి 10-12 ఏళ్లు పడుతుందని వెల్లడి
కృత్రిమ మేధ (ఏఐ) వైద్య రంగంలో అద్భుతాలు సృష్టించనుందా? క్యాన్సర్, అల్జీమర్స్, గుండె జబ్బులు, మానసిక అనారోగ్యాలు మరో పదేళ్లలో గత చరిత్రగా మారిపోతాయా? ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అయితే ఆయన అంచనాలపై ఔషధ రంగ నిపుణులు, శాస్త్రవేత్తలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
‘‘క్యాన్సర్, అల్జీమర్స్, గుండె జబ్బులు, మానసిక అనారోగ్యాలు.. ఇవన్నీ దశాబ్దంలోపే గత చరిత్రగా మారతాయని భావిస్తున్నా. మనం సరైన దిశలో పనిచేస్తే, వేల ఏళ్లుగా మానవాళిని వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం చూపగల అద్భుతాల యుగాన్ని సృష్టించవచ్చు’’’ అని అమోడెయ్ పేర్కొన్నారు. జీవశాస్త్ర పరిశోధనలు, ఔషధాల అభివృద్ధి, వైద్య ఆవిష్కరణల వేగాన్ని ఏఐ గణనీయంగా పెంచగలదని ఆయన అభిప్రాయపడ్డారు.
గూగుల్ ఏఐ విభాగం అధిపతి డెమిస్ హసాబిస్, ఎలాన్ మస్క్ కూడా ఇలాంటి ఆశాభావాన్నే వ్యక్తం చేశారు. ఔషధాల అభివృద్ధికి పట్టే పదేళ్ల సమయాన్ని ఏఐ కొన్ని వారాలకు కుదించగలదని హసాబిస్ గతంలో పేర్కొన్నారు. 20 కోట్లకు పైగా ప్రొటీన్ల నిర్మాణాలను అంచనా వేసిన ఆల్ఫాఫోల్డ్ సాధనాన్ని ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. అయితే ఇది గొప్ప శాస్త్రీయ విజయమే అయినప్పటికీ, క్యాన్సర్ వంటి సంక్లిష్ట వ్యాధులకు ఏఐ పదేళ్లలోనే మందులు కనుగొంటుందనడానికి ఆధారం కాదని నిపుణులు చెబుతున్నారు.
ఔషధ రంగం ఏమంటోంది?
ఏఐ అంచనాలపై ఔషధ తయారీ సంస్థల అధిపతులు అంతగా విశ్వాసం చూపడం లేదు. వెర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జెఫ్ లీడెన్ ఈ తరహా కాలపరిమితులను తీవ్రంగా తప్పుబట్టారు. సుమారు 10 వేల ఔషధ సమ్మేళనాలను పరిశీలించేందుకు 50 ఏఐ సంస్థల సాంకేతికతను పరీక్షించామని, వాటిలో ఏదీ స్వతంత్రంగా పనిచేసే ఔషధాన్ని అభివృద్ధి చేయలేకపోయిందని వెల్లడించారు.
కంప్యూటర్ నమూనాలో ఒక ఔషధ అణువు ఆశాజనకంగా కనిపించడం పరిశోధనలో తొలి అడుగు మాత్రమే. అది ప్రయోగశాల పరీక్షలు, జంతువులపై అధ్యయనాలు, మనుషులపై క్లినికల్ ట్రయల్స్ దాటాలి. ఔషధం సురక్షితమా? నిజంగా వ్యాధిని నయం చేస్తుందా? అన్నది నిర్ధారించాలి. నియంత్రణ సంస్థల అనుమతులూ అవసరం. సాధారణంగా ఒక ఔషధం అభివృద్ధికి 10 నుంచి 12 ఏళ్ల సమయం పడుతుంది. ఈ ప్రక్రియలో ఎక్కువ సమయం పరీక్షలకే కేటాయించాల్సి ఉంటుందని నిపుణులు గుర్తుచేస్తున్నారు.