- హరూన్ గ్లోబల్ ఇండియన్స్ జాబితాలో సుందర్ పిచాయ్ టాప్
- రెండో స్థానంలో సత్య నాదెళ్ల.. మూడో స్థానంలో సంజయ్ మెహ్రోత్రా
- 200 అంతర్జాతీయ సంస్థలకు నాయకత్వం వహిస్తున్న 236 మంది భారత సంతతి వ్యక్తులు
- భారతీయ సీఈవోల కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 15 ట్రిలియన్ డాలర్లు
- జాబితాలో స్పష్టంగా కనిపిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థల ప్రాబల్యం
ప్రపంచ కార్పొరేట్ వేదికపై భారత సంతతి వ్యాపార దిగ్గజాలు తమ తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతిష్టాత్మక 'హెచ్ఎస్బీసీ హరూన్ గ్లోబల్ ఇండియన్స్ లిస్ట్ 2026' ప్రకారం.. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) సుందర్ పిచాయ్ అత్యంత ప్రభావవంతమైన భారత సంతతి బిజినెస్ లీడర్‌గా అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆయన నేతృత్వంలోని ఆల్ఫాబెట్ సంస్థ ప్రస్తుత మార్కెట్ విలువ ఏకంగా రూ. 365.4 లక్షల కోట్లకు (4.2 ట్రిలియన్ డాలర్లు) చేరుకుంది.
ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్ సారథి సత్య నాదెళ్ల రెండో స్థానంలో నిలవగా, ప్రముఖ సెమీకండక్టర్ తయారీ సంస్థ 'మైక్రాన్ టెక్నాలజీ' సీఈవో సంజయ్ మెహ్రోత్రా మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. యూట్యూబ్ సీఈవో నీల్ మోహన్ నాలుగో స్థానంలో, గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ ఐదో స్థానంలో నిలిచారు. దీంతో గ్లోబల్ టాప్-5 స్థానాలన్నీ అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాలను నడిపిస్తున్న భారతీయ ఎగ్జిక్యూటివ్లకే దక్కడం విశేషం.
రూ. 1,300 లక్షల కోట్లకు చేరిన కంపెనీల విలువ
హరూన్ తాజా నివేదిక ప్రకారం.. భారత్ వెలుపల ప్రధాన కార్యాలయాలు కలిగిన 200 అంతర్జాతీయ కంపెనీలకు 236 మంది భారత సంతతి వ్యక్తులు నేతృత్వం వహిస్తున్నారు. ఈ సంస్థల మొత్తం సంయుక్త మార్కెట్ విలువ అక్షరాలా రూ. 1,305 లక్షల కోట్లకు (15 ట్రిలియన్ డాలర్లు) చేరుకుంది. 2024 నాటి విలువైన రూ. 861.3 లక్షల కోట్లతో (9.9 ట్రిలియన్ డాలర్లు) పోలిస్తే ఇది ఏకంగా 53 శాతం వృద్ధి చెందడం గమనార్హం.
అంతేకాకుండా, ఈ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా సుమారు 53 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీలు సంయుక్తంగా రూ. 217.5 లక్షల కోట్ల (2.5 ట్రిలియన్ డాలర్లు) ఆదాయాన్ని ఆర్జించగా, వీటి నికర లాభం రూ. 36.19 లక్షల కోట్లను (416 బిలియన్ డాలర్లు) తాకింది.
ఏఐ విప్లవంతో మైక్రాన్ దూకుడు
కంపెనీల వృద్ధి తీరును గమనిస్తే.. 2024 నుంచి ఆల్ఫాబెట్ విలువ దాదాపు 98 శాతం పెరిగింది. ఇదే సమయంలో మైక్రోసాఫ్ట్ విలువ స్వల్పంగా 17 శాతం మేర తగ్గడంతో సత్య నాదెళ్లను అధిగమించి సుందర్ పిచాయ్ ప్రథమ స్థానాన్ని చేజిక్కించుకున్నారు. మరోవైపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మౌలిక వసతుల్లో కీలకమైన మెమరీ చిప్స్‌కు డిమాండ్ భారీగా పెరగడంతో సంజయ్ మెహ్రోత్రా నేతృత్వంలోని 'మైక్రాన్ టెక్నాలజీ' మార్కెట్ విలువ కనీవినీ ఎరుగని రీతిలో 1,174 శాతం పెరిగి రూ. 121.8 లక్షల కోట్లకు (1.4 ట్రిలియన్ డాలర్లు) చేరింది. టాప్-5 కంపెనీల సంయుక్త విలువే రూ. 791.7 లక్షల కోట్లుగా (9.1 ట్రిలియన్ డాలర్లు) నమోదైంది. అంటే మొత్తం జాబితా విలువలో ఇది 61 శాతానికి సమానం.
ఏఐ సంస్థలదే పైచేయి
హరూన్ ర్యాంకింగ్స్‌లో తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఒక ప్రత్యేక విభాగంగా చేర్చారు. ఇందులో చోటు దక్కించుకున్న 18 కంపెనీల మొత్తం విలువ రూ. 19.75 లక్షల కోట్లుగా (227 బిలియన్ డాలర్లు) తేలింది. కాగా, జాబితాలోని దాదాపు 103 కంపెనీలు ఏఐ ఆధారితంగా సేవలందిస్తుండగా, వీటి మార్కెట్ విలువ రూ. 930.9 లక్షల కోట్లుగా (10.7 ట్రిలియన్ డాలర్లు) ఉంది. ఇది మొత్తం జాబితా విలువలో 71 శాతం కావడం విశేషం.
స్టార్టప్ విభాగంలో రూ. 5.22 లక్షల కోట్ల (60 బిలియన్ డాలర్లు) విలువతో ఏఐ కోడింగ్ సంస్థ 'కర్సర్' అగ్రస్థానంలో నిలిచింది. అత్యంత విలువైన టాప్-10 స్టార్టప్‌లలో ఏడు కంపెనీలు కృత్రిమ మేధ (ఏఐ) రంగంలోనే ఉండగా, ఇవన్నీ అమెరికా కేంద్రంగానే పనిచేస్తున్నాయి. రంగాలవారీగా పరిశీలిస్తే.. 53 కంపెనీలతో సాఫ్ట్వేర్ & సర్వీసెస్ విభాగం మొదటి స్థానంలో నిలవగా, ఫైనాన్షియల్ సర్వీసెస్ (31 కంపెనీలు), హెల్త్‌కేర్ (21 కంపెనీలు) తర్వాతి స్థానాలను కైవసం చేసుకున్నాయి.