రాత్రి ఆలస్యంగా పడుకుంటే బరువు పెరుగుతారా? అధ్యయనం ఏం చెప్పిందంటే..!
- నిద్ర తగ్గితే ఆరు వారాల్లో బరువు పెరిగినట్లు అధ్యయనంలో వెల్లడి
- నిద్ర తక్కువైతే శారీరక కదలికలు తగ్గినట్లు గుర్తించిన పరిశోధకులు
- నిద్రలేమితో దీర్ఘకాల ఆరోగ్య ముప్పు పెరగొచ్చన్న అధ్యయనం
- పడుకునే ముందు ఫోన్ వాడకం తగ్గించాలని సూచన
- రోజూ ఒకే సమయానికి నిద్రపోవాలని సలహా
బరువు తగ్గాలంటే ఆహారం, వ్యాయామం గురించి ఆలోచిస్తాం. కానీ నిద్ర విషయంలో మాత్రం పెద్దగా పట్టించుకోం. ఆలస్యంగా పడుకోవడం, ఫోన్ చూస్తూ నిద్రను తగ్గించుకోవడం ఇప్పుడు చాలామందికి అలవాటుగా మారింది. అయితే ఇలా రోజూ నిద్ర తగ్గడం బరువుపైనా ప్రభావం చూపుతుందని కొలంబియా యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనం వెల్లడించింది. ఒక రాత్రిలో గంటా 20 నిమిషాల వరకు నిద్ర తగ్గితే ఆరు వారాల్లో బరువు పెరిగినట్లు గుర్తించారు.
95 మందిపై పరిశీలన
20 ఏళ్లు పైబడిన 95 మందిని పరిశోధకులు ఈ అధ్యయనంలో భాగం చేశారు. వారి ఇళ్లలోనే సాధారణ జీవనశైలిని కొనసాగిస్తూ పరిశీలించారు. మొదటి ఆరు వారాలు రోజుకు 7 నుంచి 9 గంటలు నిద్రపోయేలా చేశారు. తర్వాతి ఆరు వారాల్లో పడుకునే సమయాన్ని 90 నిమిషాలు ఆలస్యం చేశారు. ఈ సమయంలో వారి బరువు, రోజువారీ కదలికలను గమనించారు.
450 గ్రాముల వరకు పెరుగుదల
నిద్ర దాదాపు 80 నిమిషాలు తగ్గినప్పుడు ఆరు వారాల్లో సగటున 450 గ్రాముల బరువు పెరిగింది. అంతేకాదు.. నిద్ర తక్కువైనవారు రోజులో శారీరకంగా కూడా తక్కువగా కదిలినట్లు పరిశోధకులు గుర్తించారు. అంటే నిద్ర తగ్గడంతో కదలికలు తగ్గి ఎక్కువ సమయం కూర్చోవడం లేదా విశ్రాంతిగా ఉండటం పెరిగింది.
ఆరోగ్యానికీ ముప్పే
తరచూ నిద్ర తగ్గితే శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెరగొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. దీర్ఘకాలంలో పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం, అధిక రక్తపోటు, టైప్-2 మధుమేహం, గుండె జబ్బుల వంటి సమస్యల ముప్పు పెరగొచ్చు.
మంచి నిద్ర కోసం..
నిద్రకు ముందు ఫోన్, టీవీ వాడకాన్ని తగ్గించాలి. రోజూ ఒకే సమయానికి పడుకుని, ఒకే సమయానికి లేవడం అలవాటు చేసుకోవాలి. పడుకునే గది చల్లగా, చీకటిగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. పీచు పదార్థాలు, ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న బ్యాలెన్స్‌డ్ ఫుడ్ తీసుకోవడం కూడా నిద్రకు మేలు చేస్తుంది. తగినంత నిద్రపోయినా పగటిపూట ఎప్పుడూ అలసటగా ఉంటే వైద్యులను సంప్రదించాలి. స్లీప్ అప్నియా వంటి నిద్ర సమస్యలు ఇందుకు కారణం కావొచ్చు.