యూపీ సీఎం యోగి నెక్స్ట్ పీఎం.. ఛాతీపై పచ్చబొట్టు వేయించుకున్న ముస్లిం అడ్వకేట్

యూపీ సీఎం యోగి నెక్స్ట్ పీఎం.. ఛాతీపై పచ్చబొట్టు వేయించుకున్న ముస్లిం అడ్వకేట్

UP CM Yogi Next PM Muslim Advocate Gets Tattoo On Chest
  • యూపీ సీఎం యోగిపై అభిమానంతో ఛాతీపై పచ్చబొట్టు 
  • తదుపరి ప్రధాని యోగీయేనంటూ టాటూలో పేర్కొన్న తబిష్ నిసార్
  • యోగి పాలనలో శాంతిభద్రతలు మెరుగుపడ్డాయని ప్రశంస
  • ప్రభుత్వ పథకాలు వివక్ష లేకుండా అందరికీ అందుతున్నాయన్న న్యాయవాది
ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై ఒక ముస్లిం న్యాయవాది చూపిన అభిమానం ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. యూపీలోని బిజ్నోర్‌కు చెందిన తబిష్ నిసార్ అనే అడ్వకేట్, యోగిపై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ ఏకంగా ఛాతీపై పచ్చబొట్టు వేయించుకున్నారు. యోగికి తాను వీరాభిమానినని ఆయన చెప్పుకున్నారు.

‘నెక్స్ట్ పీఎం, సీఎం సాహెబ్ మహారాజ్ జీ యోగి జీ బీజేపీ’ అని ఆయన తన ఛాతీపై శాశ్వతంగా పచ్చబొట్టు పొడిపించుకున్నారు. ఇది ప్రచారం కోసం కాదని, యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వ పనితీరుకు మెచ్చి మాత్రమే ఇలా చేశానని నిసార్ స్పష్టం చేశారు. యోగి ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు బలపడ్డాయని, ప్రభుత్వ పథకాలు ఎలాంటి వివక్ష లేకుండా ప్రజలకు అందుతున్నాయని ఆయన ప్రశంసించారు.

యోగి ఆదిత్యనాథ్ పాలనా శైలి, పాలనలో ఆయన ప్రాధాన్యతలకు తాను ఎంతగానో ముగ్ధుడయ్యానని నిసార్ తెలిపారు. ముఖ్యంగా శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన కొనియాడారు. యోగి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో కర్ఫ్యూ లాంటి పరిస్థితులు లేవని పేర్కొన్నారు. మహిళలు, బాలికల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడాన్ని కూడా ఆయన ప్రశంసించారు.

సాధారణంగా అభిమానులు పోస్టర్లు, జెండాలు లేదా సోషల్ మీడియా పోస్టుల ద్వారా తమ మద్దతు తెలుపుతారు. కానీ, నిసార్ వీటికి భిన్నంగా తన ఛాతీపై శాశ్వత పచ్చబొట్టు వేయించుకుని యోగిపై తనకున్న ప్రగాఢ అభిమానాన్ని చాటుకున్నారు.
Advertisement
Yogi Adityanath
Tabish Nisar
Bijnor Muslim Advocate
Muslim Lawyer Yogi Tattoo
Uttar Pradesh Governance
Next Prime Minister

More Telugu News