Ram Charan: ఆ గుణాలే శ్రీరామరక్ష... రామ్ చరణ్‌కు బర్త్ డే విషెస్ తెలిపిన పవన్ కల్యాణ్

Pawan Kalyan Wishes Ram Charan Happy Birthday
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ యువ కథానాయకుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు ఆయన బాబాయ్, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు. నటన పట్ల రామ్ చరణ్‌కు ఉన్న అంకితభావాన్ని కొనియాడారు. ప్రతి చిత్రాన్ని తపనతో చేస్తాడని ప్రశంసించారు. 

"హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్! ప్రముఖ యువ కథానాయకుడు రామ్ చరణ్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నటన పట్ల అంకిత భావం కలిగిన రామ్ చరణ్ ప్రతి చిత్రాన్ని తపనతో చేస్తారు. కుటుంబ బంధాలకు విలువనిస్తూ పెద్దల పట్ల గౌరవం కనబరుస్తూ, సహచర నటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు, రచయితలతో మర్యాదగా మెలుగుతారు. ఆధ్యాత్మిక చింతన మెండుగా ఉంది. ఇవే రామ్ చరణ్ కు ఎల్లవేళలా శ్రీరామరక్ష. రామ్ చరణ్ కు మరిన్ని విజయాలు, సంపూర్ణ ఆనందాన్ని ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను" అంటూ పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

Go Back to Shorts
Ram Charan
Pawan Kalyan
Ram Charan birthday
Janasena
AP Deputy CM
Tollywood
RRR
Telugu cinema
Global star

More Telugu News