- ఫెయిర్‌నెస్ క్రీమ్ వాడి కిడ్నీ సమస్య బారిన పడ్డ కేరళ బాలిక
- ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ల ప్రచారాన్ని నమ్మి వాట్సాప్‌లో క్రీమ్ కొనుగోలు
- క్రీమ్‌లో మెర్క్యురీ స్థాయి ఏకంగా 12,500 పీపీఎం
- బాలికకు 'మెంబ్రానస్ నెఫ్రోపతి' అనే కిడ్నీ వ్యాధి
- మెర్క్యురీ చర్మం ద్వారా శరీరంలోకి చేరి అంతర్గత అవయవాలను దెబ్బతీసిన వైనం
అందంగా కనిపించాలన్న కోరిక ఎవరికి ఉండదు? ముఖంపై ఒక్క మొటిమ వస్తేనే ఆందోళన చెందే ఈ రోజుల్లో, కొన్ని రోజుల్లోనే తెల్లబడతారంటూ వచ్చే ప్రకటనలు ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాయి. ముఖ్యంగా సోషల్ మీడియా రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల ప్రచారాలను గుడ్డిగా నమ్మి చాలామంది మోసపోతున్నారు. తళతళలాడే చర్మం కోసం వాడే కొన్ని ఫెయిర్‌నెస్ క్రీములు ప్రాణాల మీదకే తెస్తున్నాయన్న చేదు నిజాన్ని కేరళలో చోటుచేసుకున్న తాజా సంఘటన కళ్లకు కట్టింది. తెల్లదనం మాట దేవుడెరుగు.. విషపూరితమైన కెమికల్స్ ఏకంగా మూత్రపిండాలనే దెబ్బతీస్తున్న వైనం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
సోషల్ మీడియా మోజులో కేరళ బాలిక
కేరళలోని మలప్పురానికి చెందిన 17 ఏళ్ల బాలిక ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన వీడియోలను చూసి ఆకర్షితురాలైంది. అందులో ఇచ్చిన వాట్సాప్ నంబర్ ద్వారా చర్మం తెల్లబడే ఒక క్రీమును ఆర్డర్ చేసింది. ముఖంపై మచ్చలు, మొటిమలు తగ్గడంతో దాదాపు ఏడాది పాటు దాన్ని వాడింది. కొన్ని రోజులకు కాళ్లలో వాపు రావడం, ఉన్నట్టుండి రక్తపోటు పడిపోవడం, తరచూ స్పృహ తప్పి పడిపోవడం వంటి సమస్యలు మొదలయ్యాయి. ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేయగా, ఆమె తీవ్రమైన కిడ్నీ సంబంధిత సమస్య ‘మెంబ్రానస్ నెఫ్రోపతి’ బారిన పడినట్లు డాక్టర్లు గుర్తించారు.
క్రీముల్లో విషం.. ప్రమాదకర స్థాయిలో మెర్క్యురీ
ఆ బాలిక రక్త నమూనాలను, ఆమె వాడిన క్రీమును ల్యాబ్‌లో పరిశీలించినప్పుడు మైండ్ బ్లాంక్ అయ్యే వాస్తవాలు వెలుగుచూశాయి. సాధారణంగా సౌందర్య ఉత్పత్తుల్లో మెర్క్యురీ (పాదరసం) స్థాయి ఒక పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) కంటే తక్కువ ఉండాలి. కానీ ఆ అమ్మాయి వాడిన క్రీములో ఏకంగా 12,500 పీపీఎం మెర్క్యురీ ఉన్నట్లు తేలింది. అనుమతించిన పరిమితి కంటే ఇది వేల రెట్లు ఎక్కువ. దీంతో ఆమె శరీరంలోకి అధిక మోతాదులో పాదరసం చేరి కిడ్నీలను దెబ్బతీసింది. ఈ ఘటనపై స్పందించిన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించింది.
చర్మం తెల్లబడటం వెనుక దాగున్న చేదు నిజం
చర్మ రంగుకు కారణమయ్యే ‘మెలనిన్’ ఉత్పత్తిని అడ్డుకునేందుకు కొన్ని అక్రమ సంస్థలు క్రీముల్లో మెర్క్యురీని కలుపుతుంటాయి. మొదట్లో ఇది చర్మాన్ని తెల్లగా మార్చినట్లు అనిపించినా, దీర్ఘకాలంలో తీవ్రమైన దుష్ప్రభావాలు చూపుతుంది. చర్మం ద్వారా మెర్క్యురీ నెమ్మదిగా శరీరంలోకి చేరి అంతర్గత అవయవాలను విషతుల్యం చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసే కిడ్నీలలో పేరుకుపోయి ఫిల్టరింగ్ వ్యవస్థను పూర్తిగా దెబ్బతీస్తుంది.
శరీరంలో కనిపించే ప్రమాదకర హెచ్చరికలు
మెర్క్యురీ వల్ల కిడ్నీల ఫిల్టరింగ్ దెబ్బతిన్నప్పుడు మూత్రం నుంచి ప్రొటీన్లు బయటకు వెళ్లిపోతాయి. దీనిని ప్రొటీనూరియా అంటారు. దీనివల్ల కాళ్లు, చీలమండల్లో తీవ్రమైన వాపులు వస్తాయి. రక్తపోటులో ఆకస్మిక మార్పులు చోటుచేసుకుంటాయి. చర్మంపై దద్దుర్లు, ఎరుపుదనం, అలర్జీలు వస్తాయి. శరీరంలోకి చేరిన మెర్క్యురీ నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపి చేతులు వణకడం, ఏకాగ్రత లోపించడం, కండరాల బలహీనత వంటి నాడీ సమస్యలకు దారితీస్తుంది. అలాగే రోగనిరోధక వ్యవస్థను సైతం దెబ్బతీస్తుంది.
త్వరగా మార్పు వస్తుందంటే నమ్మొద్దు
రాత్రికి రాత్రే లేదా కొన్ని రోజుల్లోనే రంగు మారుస్తామని ప్రచారం చేసే ఉత్పత్తుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక వ్యాపారుల లింకులు, ప్రచారాలను నమ్మి కొనుగోళ్లు చేయవద్దు. చర్మ సమస్యలు ఎదురైనప్పుడు స్వయంగా నిర్ణయాలు తీసుకోకుండా అర్హులైన డెర్మటాలజిస్టులను సంప్రదించి చికిత్స తీసుకోవడమే సురక్షితమైన మార్గం.