KCR: కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి, పవన్ కల్యాణ్, జగన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు

KCR Receives Birthday Wishes From Revanth Reddy Pawan Kalyan and Jagan
  • సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలన్న రేవంత్ రెడ్డి
  • 'ఎక్స్' వేదికగా శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
  • సుదీర్ఘకాలంగా ప్రజాజీవితంలో ఉన్నారంటూ పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు కేసీఆర్‌కు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు కూడా కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. "తెలంగాణ మాజీ సీఎం కే చంద్రశేఖర రావుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నిండా నూరేళ్లు సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను" అని జగన్ 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు.

కేసీఆర్‌ సుదీర్ఘకాలంగా ప్రజా జీవితంలో ఉన్నారని, రాష్ట్రానికి మరింత సేవ చేసే శక్తిని ఆయనకు దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
KCR
K Chandrasekhar Rao
Revanth Reddy
Pawan Kalyan
YS Jagan Mohan Reddy
Telangana
BRS

More Telugu News