- ఖానాపూర్, హైదరాబాద్‌లలో ఉదయం నుంచే ముమ్మరంగా సాగుతున్న తనిఖీలు
- రూ.40.96 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు
- ఖానాపూర్ నివాసం వద్ద రేఖను అరెస్ట్ చేసే అవకాశం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌కు సంబంధించి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఈ ఉదయం ఖానాపూర్‌తో పాటు హైదరాబాద్‌లోని ఆమె నివాసాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో ముమ్మర సోదాలు చేపట్టారు.
ఖానాపూర్ మండలం సత్తెనపల్లి వద్ద రేఖానాయక్‌కు చెందిన ఏఆర్ఎస్ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లుకు ప్రభుత్వం మిల్లింగ్ నిమిత్తం ధాన్యాన్ని కేటాయించింది. అయితే, 2022-23, 2023-24, 2024-25 రబీ సీజన్లకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ధాన్యంలో పెద్ద మొత్తంలో బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీని విలువ మార్కెట్లో సుమారు రూ.40.96 కోట్లు ఉంటుందని పౌరసరఫరాల శాఖ గుర్తించింది.
గత ఆగస్టు నెలలో విజిలెన్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా ధాన్యం నిల్వలు మాయమైనట్లు తేలింది. దీనిపై జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఫిర్యాదు చేయడంతో ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. ఈ కేసు ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టిన ఈడీ అధికారులు తాజాగా రంగంలోకి దిగి సోదాలు చేస్తున్నారు.
ప్రస్తుతం ఖానాపూర్లోని రేఖానాయక్ నివాసం వద్ద విజిలెన్స్, స్థానిక పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. నివాసాల్లో రికార్డులను పరిశీలిస్తున్న అధికారులు, విచారణ అనంతరం ఆమెను అదుపులోకి తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.