- కోడింగ్, గణితం పూర్తిగా ఏఐ చేతుల్లోకి వెళ్తాయన్న జోహో అధినేత
- యంత్రాలు వచ్చినప్పుడు శ్రామికులు ఎదుర్కొన్న పరిస్థితే ఇప్పుడు కోడర్లకు రానుందని విశ్లేషణ
- ఒకే వ్యక్తి ఏఐ సాయంతో పది మంది పనిని సులువుగా పూర్తిచేయగలడని వెల్లడి
- మానవాళి మనుగడకు ప్రకృతి, ఆధ్యాత్మిక గ్రంథాలే భవిష్యత్ మార్గాలని అభిప్రాయం
- ఇంజినీరింగ్ బ్యాక్గ్రౌండ్ లేనివారూ క్లిష్టమైన డిజైన్లు రూపొందించగలరని వెల్లడి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) శరవేగంగా విస్తరిస్తున్న వేళ.. కోడింగ్, గణితం వంటి మేధోపరమైన రంగాలను భవిష్యత్తులో సాంకేతికతే పూర్తిగా శాసించబోతోందని ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కంప్యూటర్ ఆధారిత పనులన్నీ ఏఐ చేతుల్లోకి వెళ్లాక మానవులు మళ్లీ ప్రకృతి, ప్రాచీన గ్రంథాల వైపు మళ్లక తప్పదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం నలుగుతున్న ఏఐ ప్రభావంపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన చేసిన విశ్లేషణ టెక్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
గతంలో యంత్రాల రాకతో రైతులు, చేనేత కార్మికులు, వడ్రంగులు, కమ్మరి వంటి శ్రామిక వర్గాలు ఎలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయో.. నేడు కోడర్లు, గణిత శాస్త్రవేత్తలు సరిగ్గా అదే పరిస్థితిని చవిచూడబోతున్నారని వెంబు పేర్కొన్నారు. ప్రస్తుత మోడల్స్ క్షణాల్లో వేల లైన్ల కోడింగ్ రాయడంతో పాటు సంక్లిష్టమైన గణిత సమస్యలను సైతం పరిష్కరిస్తున్నాయని గుర్తుచేశారు.
ఈ క్రమంలో కంప్యూటర్ల ముందు కూర్చుని చేసే పనుల్లో ఒకే ఒక్క వ్యక్తి ఏఐ సాయంతో పది మంది పనిని పూర్తిచేసే రోజులు వచ్చాయన్నారు. మానవుడి మేధోపరమైన ఆధిపత్యానికి ఏఐ తెరదించిన తర్వాత అసలైన మానవీయ విలువలైన ప్రకృతి, సంస్కృతి, జీవన పోషణ, ఆధ్యాత్మిక గ్రంథాలే మిగులుతాయని, అవే భవిష్యత్ ఉద్యోగ రంగాలుగా మారే అవకాశముందని స్పష్టం చేశారు.
అయితే ఈ పరిణామాన్ని కేవలం నిరుద్యోగ కోణంలోనే చూడాల్సిన అవసరం లేదని వెంబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంజినీరింగ్ నేపథ్యం లేని వ్యక్తి సైతం ఏఐ సాయంతో క్యాడ్ డిజైన్లు వేయగలగడం ఇందుకు నిదర్శనమన్నారు. గతంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లను భరించలేని చిన్న పరిశ్రమలు సైతం ఇప్పుడు వీరిని వినియోగించుకునే వెసులుబాటు కలుగుతుందని తెలిపారు. ఈ మార్పు వల్ల ఆర్థిక వ్యవస్థలో కొంత గందరగోళం తలెత్తినా.. ఉత్పాదకత మాత్రం పది నుంచి వంద రెట్లు పెరుగుతుందన్నారు. దీనికి అనుగుణంగా సమాజం కొత్త ఆలోచనలతో సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.