- ఇది 14 నెలల క్రితం నాటి పాత వ్యవహారమని స్పష్టం చేసిన బిస్లరీ
- గోవా ప్లాంట్‌లోని ఒకే ఒక్క నమూనాకు మాత్రమే సంబంధించిన అంశమన్న సంస్థ
- తమ ఉత్పత్తులన్నీ నాణ్యతా ప్రమాణాల ప్రకారమే ఉన్నాయని యాజమాన్యం వెల్లడి
ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నమూనాలు భద్రతా పరీక్షల్లో విఫలమయ్యాయంటూ భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చిన వ్యవహారంపై ‘బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్’ స్పందించింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న తమ ఉత్పత్తులన్నీ వినియోగానికి పూర్తిగా సురక్షితమని సంస్థ స్పష్టం చేసింది.
ఈ వివాదం దాదాపు 14 నెలల క్రితం నాటిదని బిస్లరీ యాజమాన్యం వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ 143 ప్లాంట్లలో ఒకటైన గోవా తయారీ కేంద్రంలో సెప్టెంబర్ 2025లో ఉత్పత్తి అయిన ఒకే ఒక్క బ్యాచ్‌కు సంబంధించిన అంశమిదని తెలిపింది. అప్పట్లో అధికారులు సేకరించిన 6 నమూనాలలో 5 నమూనాలు అన్ని ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని, కేవలం ఒక నమూనాలో మాత్రమే బ్రోమేట్ పరిమితి (నిర్దేశిత 10 మైక్రోగ్రాములకు గాను 12 మైక్రోగ్రాములు) స్వల్పంగా ఎక్కువగా ఉన్నట్లు ప్రాథమిక పరీక్షలో తేలిందని వివరించింది.
మరోవైపు, బిస్లరీ ప్యాకేజ్డ్ వాటర్ నమూనాలో బ్రోమేట్ ఎక్కువగా ఉండటంతో పాటు రిఫరల్ ల్యాబ్ పరీక్షలో ప్రమాదకర పాలీన్యూక్లియర్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs) ఉన్నట్లు తేలిందని, అందుకే ఆహార భద్రత ప్రమాణాల చట్టం-2006 ప్రకారం ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చామని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది.
అయితే స్వతంత్ర ల్యాబ్‌లలో నిర్వహించిన తదుపరి పరీక్షల్లో బ్రోమేట్ నిర్దేశిత పరిమితిలోనే ఉన్నట్లు తేలిందని, ఆ వివరాలను గతంలోనే అధికారులకు సమర్పించామని బిస్లరీ తెలిపింది. తమకు ప్రాసిక్యూషన్‌కు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక నోటీసు అందలేదని స్పష్టం చేసింది. "తమకు తాగునీటి భద్రతే మొదటి ప్రాధాన్యమని, 10 దశల తయారీ ప్రక్రియలో 90కి పైగా కఠిన నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తున్నామని" కంపెనీ పేర్కొంది. ఎఫ్ఎస్ఎస్ఏఐ విచారణ ప్రక్రియకు పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి మార్కెట్ నుంచి ఉత్పత్తుల ఉపసంహరణ (రీకాల్) ఆదేశాలేవీ జారీ కాలేదు.