Srinivasa Rao: విశాఖలో పీఆర్ రిటైర్డ్ ఎస్ఈ నివాసంలో ఏసీబీ సోదాలు

ACB Raids Retired PR SE Srinivasa Raos Residence in Visakhapatnam
  • విశాఖలో పంచాయతీరాజ్ రిటైర్డ్ ఎస్ఈ శ్రీనివాసరావు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు
  • ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సోదాలు 
  • శ్రీనివాసరావు బంధువుల నివాసాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్న అధికారులు
విశాఖలో ఇటీవలే పదవీ విరమణ చేసిన పంచాయతీరాజ్ ఎస్ఈ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. రిటైర్డ్ ఎస్ఈ శ్రీనివాసరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విశాఖ మధురవాడలో ఉన్న నివాసంతో పాటు సమీప బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. 

సాలూరులో శ్రీనివాసరావు బంధువు నారాయణరావుతో పాటు హైదరాబాద్ లోని ఇతర బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. 

More Telugu News

Srinivasa Rao
Srinivasa Rao ACB Raid
Visakhapatnam
Madhurawada
ACB Raids Andhra Pradesh
Disproportionate Assets Case
Salur
Narayana Rao