- హైదరాబాద్ చిన్నపిల్లల వైద్యురాలు డాక్టర్ శివరంజని సంతోష్ మానవతా ప్రయత్నం ఫలప్రదం
- యాక్సెస్ టు మెడిసిన్స్ ఇండియా సంస్థ సహకారంతో ధర తగ్గింపులో ఘన విజయం
- అరుదైన ఏహెచ్డీఎస్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు పునర్జన్మ
- బాధితులైన ఏడుగురు చిన్నారులకు ఏడాది పాటు ఉచితంగా మందులు
- నవంబర్ 30న ఆ ఏడుగురు చిన్నారుల కుటుంబాలకు ఔషధాల అందజేత
కళ్ల ముందే కన్నబిడ్డ కరిగిపోతుంటే చూస్తూ తల్లడిల్లిపోవడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయత.. తమ బిడ్డను బతికించుకునే మందు ఉందని తెలిసినా, అది కొండంత ధరతో సామాన్యుడికి అందనంత దూరంలో ఉండటం ఆ తల్లిదండ్రులకు అంతకంటే తీరని శాపం. అలన్-హెర్న్డన్-డడ్లీ సిండ్రోమ్ (ఏహెచ్డీఎస్) అనే అరుదైన జన్యు సమస్యతో నరకయాతన అనుభవిస్తున్న పసిపిల్లల తల్లిదండ్రుల గుండెకోత ఇది. ఏడాదికి ఏకంగా రూ.9 కోట్లు ఖర్చయ్యే 'టిరాట్రికోల్' ఔషధాన్ని కొనుగోలు చేయడం పేద, మధ్యతరగతి కుటుంబాలకు కలలో కూడా ఊహించని భారం. ఆ పసికందుల ప్రాణాల కోసం, కన్నీటి సాగరంలో మునిగిన కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ఓ వైద్యురాలు కదిలారు. దైవంలా ఆదుకోవడానికి నడుం బిగించారు.
హైదరాబాద్కు చెందిన ప్రముఖ చిన్నపిల్లల వైద్యురాలు డాక్టర్ శివరంజని సంతోష్ అలుపెరగని పోరాటం చేశారు. యాక్సెస్ టు మెడిసిన్స్ ఇండియా సంస్థతో చేతులు కలిపి ఔషధ కంపెనీలతో పోరాడారు. బిడ్డల ప్రాణాల విలువ ముందు ఈ కోట్ల కొలతలు ఎందుకని ప్రశ్నిస్తూ అవిశ్రాంతంగా కృషి చేశారు. ఆమె నిరంతర సంకల్పం ముందు అసాధ్యమనుకున్నది సుసాధ్యమైంది. అమాంతం రూ.9 కోట్లు పలికే ఆ మందు ఖర్చును ఏకంగా రూ.2.5 లక్షలకు తగ్గించడంలో అద్భుత విజయం సాధించారు. కోట్లలో ఉన్న ధరను లక్షల్లోకి తీసుకువచ్చి ఎన్నో కుటుంబాలకు బతుకుపై భరోసా కల్పించారు.
ధర తగ్గించడంతోనే ఆమె ప్రయత్నం ఆగిపోలేదు. ఈ అరుదైన నరాల వ్యాధితో పోరాడుతూ నిస్సహాయ స్థితిలో ఉన్న ఏడుగురు చిన్నారులకు ఏడాదికి సరిపడా 'టిరాట్రికోల్' ఔషధాన్ని ఉచితంగా అందించేందుకు కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. నవంబర్ 30న ఈ ఏడుగురు చిన్నారుల కుటుంబాలకు మందులను అందజేయనున్నారు. మగపిల్లల్లో కండరాల క్షీణత, ఎదుగుదల లోపాన్ని మిగిల్చే ఈ రాకాసి వ్యాధిపై పోరాడుతున్న చిన్నారులకు డాక్టర్ శివరంజని చూపిన మానవతా దృక్పథం కొత్త ఊపిరి పోసింది.