- నవంబర్ 30 ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లును వ్యతిరేకించాలని విపక్షాలకు పిలుపు
- బీజేపీకి అనుకూలంగా సరిహద్దులను మార్చే 'గెర్రీమాండరింగ్' ప్రమాదంపై హెచ్చరిక
- డీఎంకే, ఎన్సీపీ వైఖరి మార్పుపై అశుతోష్ రంకా ఘాటు విమర్శలు
- మహిళా రిజర్వేషన్ల ముసుగులో సరిహద్దుల కుట్ర సాగుతోందని ఆరోపణ
- రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం పార్టీలు ఏకం కావాలని డిమాండ్
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరించిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుకు మద్దతు ఇవ్వడం అంటే ప్రజా తీర్పును ఘోరంగా వంచించడమేనని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అభిప్రాయపడింది. నవంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న 131వ రాజ్యాంగ సవరణ బిల్లును విపక్ష పార్టీలన్నీ ఐక్యంగా వ్యతిరేకించాలని కోరింది. పార్లమెంట్లో జరుగుతున్న పరిణామాలను దేశ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని పేర్కొందది. అధికార పక్ష కుతంత్రాలకు కొమ్ముకాసే నేతలను, పార్టీలను చరిత్ర ఎప్పటికీ క్షమించదని స్పష్టం చేసింది.
అభిజీత్ దిప్కే నేతృత్వంలోని ఈ యువజన ఉద్యమ వేదిక.. డీలిమిటేషన్ వెనుక దాగి ఉన్న అసలైన ప్రమాదం 'గెర్రీమాండరింగ్' (అధికార పార్టీకి అనుకూలంగా నియోజకవర్గాల సరిహద్దులను అక్రమంగా మార్చడం) అని ఆరోపించింది. పోలింగ్ బూత్ స్థాయి గణాంకాలు, ఓటరు జాబితాలు, పాత ఓటింగ్ సరళిని ఉపయోగించుకుని బీజేపీకి శాశ్వత రాజకీయ ప్రయోజనం చేకూరేలా సరిహద్దులను విభజించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. తగిన స్వతంత్ర పర్యవేక్షణ, రక్షణలు లేకుండా సరిహద్దులను తిరిగి గీస్తే, భవిష్యత్ ఎన్నికల్లో ప్రజాభిప్రాయం మారినా సభలో అది ప్రతిబింబించకుండా పోతుందని పేర్కొంది.
డీఎంకే, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) వంటి పార్టీలు తమ వైఖరిని మార్చుకుని బిల్లుకు అనుకూలంగా సంకేతాలు ఇవ్వడంపై సీజేపీ కో-కన్వీనర్లు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సీట్లు 50 శాతం పెరుగుతున్నాయనే నెపంతో ఈ పార్టీలు మద్దతిస్తున్నాయని, అయితే అసోంలో జరిగిన సరిహద్దుల మార్పులను ఒకసారి పరిశీలిస్తే ఎలాంటి 'గెర్రీమాండరింగ్' ప్రమాదంలో పడుతున్నారో అర్థమవుతుందని హెచ్చరించారు. స్వార్థ రాజకీయాల కోసం రాజ్యాంగ విలువలపై రాజీపడితే వచ్చే తరాలు, దేశ యువత తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళా రిజర్వేషన్ల ముసుగులో కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల సరిహద్దుల తారుమారుకు ప్రయత్నిస్తోందని సీజేపీ ఆరోపించింది. మహిళా కోటా చట్టం ఇప్పటికే ఆమోదం పొంది అమలుకు నోచుకోలేదని, దానిని సాకుగా చూపి ఎన్నికల మ్యాప్‌ను మార్చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రజల విశ్వసనీయతను కోల్పోయిందని ఆరోపిస్తూ, అలాంటి వ్యవస్థ చేతుల్లో సరిహద్దుల పునర్విభజన పెడితే ప్రజాస్వామ్యానికే పెను ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.