- సిద్దిపేట జిల్లా సైన్స్ ఫేర్‌ను ప్రైవేట్ స్కూల్లో పెట్టడంపై హరీశ్ రావు అసహనం
- గత ప్రభుత్వ హయాంలో సిద్దిపేటకు జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయని వెల్లడి
- సిద్దిపేట విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు చేయాలని డిమాండ్
సిద్దిపేట జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన (సైన్స్ ఫేర్) నిర్వహణ వేదిక ఎంపికపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించాల్సిన జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని ఒక ప్రైవేట్ విద్యాసంస్థలో ఏర్పాటు చేయడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు.
కనీసం ప్రభుత్వ పాఠశాలలో జరిపే సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాలలో జరిపే స్తోమత కూడా ప్రభుత్వానికి లేదా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో సైన్స్ ఫేర్ లో సిద్దిపేటకు జాతీయ స్థాయి అవార్డులు తెచ్చుకున్నామని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రదర్శనల పట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆయన విమర్శించారు.
సిద్దిపేటపై వివక్షతోనే ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. సైన్స్ ఫేర్ అంశంతో పాటు విద్యార్థుల సంక్షేమ పథకాల అమలులోనూ అలసత్వం కనిపిస్తోందన్నారు. విద్యార్థులకు అందించాల్సిన బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని సిద్దిపేటలో ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రస్తుత విద్యా సంవత్సరం సగం పూర్తవుతున్నప్పటికీ విద్యార్థులకు కేవలం ఒక్క జత యూనిఫాం మాత్రమే ఇచ్చారని గుర్తుచేశారు. విద్యార్థులకు వెంటనే మిగిలిన యూనిఫాంలను పంపిణీ చేయాలని, బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని వెంటనే పూర్తిస్థాయిలో ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు.