- లారీ ఢీకొని కేసీఆర్ సహాయకుడు మణికుమార్ రెడ్డి దుర్మరణం
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో యువకుడు భరత్ మృతి
- మాజీ ఎంపీపీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న కేసీఆర్
- మృతుడి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా
రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహాయకుడు కస్తూరి మహేందర్ రెడ్డి అలియాస్ మణికుమార్ రెడ్డి దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదంలో అతడితో పాటు ప్రయాణిస్తున్న మరో యువకుడు కూడా మృతి చెందాడు. ఈ విషాద ఘటనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామ సమీపంలోని హనుమాన్ నగర్ చౌరస్తా వద్ద రాత్రి వేళ ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెంకయ్యకుంట సమీపంలో మణికుమార్ రెడ్డి, భరత్ అనే యువకుడు బైక్‌పై వెళుతుండగా, ఎదురుగా వచ్చిన ఊక లారీ వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాద తీవ్రతకు కస్తూరి మహేందర్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర గాయాలపాలైన భరత్‌ను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో అర్ధరాత్రి 2 గంటల సమయంలో చికిత్స పొందుతూ భరత్ కూడా మృతి చెందాడు.
మణికుమార్ రెడ్డి మృతి వార్త తెలిసిన వెంటనే కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ముస్తాబాద్ మాజీ ఎంపీపీ జనగామ శరత్ రావుకు ఫోన్ చేసిన కేసీఆర్, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆయన, ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.