- పల్నాడు వాటర్ గ్రిడ్ అంశంపై రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు
- ప్రాజెక్టు వివాదంలో ప్రభుత్వం వెనుకటి తేదీతో లేఖలు రాసిందన్న మాజీ మంత్రి హరీశ్ రావు
- చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు నోరు లేపుతున్నారని విమర్శ
నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ అంశంలో తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ వివాదం తీవ్రరూపం దాల్చింది. ఈ ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయి, తప్పించుకునేందుకు ఎదురుదాడి చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఆరోపించారు.
పల్నాడు ప్రాజెక్టు టెండర్ల వ్యవహారాన్ని పత్రికలు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయటపెట్టిన తర్వాతనే రేవంత్ ప్రభుత్వం బ్యాక్ డేట్‌తో ఉత్తరాలు రాసిందని హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు 2025 జనవరి 24నే టెండర్లు పిలిచారని, అప్పుడే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. నీటిపారుదల శాఖ మంత్రి సొంత జిల్లాలో ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేదని, తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు గొంతు పెంచితే సరిపోదని ఆయన మండిపడ్డారు.
మరోవైపు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వివాదంపై స్పందిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని తెలిపారు. 2022 ఫిబ్రవరి 16న నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం జీవో నెం. 56 జారీ చేసినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ విషయాన్ని గుర్తించి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ), కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి ప్రాజెక్ట్ పనులను అడ్డుకునే ప్రయత్నం చేశామని సీఎం వివరించారు. ఇదే సమయంలో, ఆంధ్రప్రదేశ్ అధికారులు స్పందిస్తూ.. కేటాయించిన వాటా నుంచే 1.865 టీఎంసీల తాగునీటిని తీసుకుంటున్నామని, దీనికి కొత్త అనుమతులు అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.