- రాహుల్ గాంధీపై 'ఎక్స్' వేదికగా కేటీఆర్ విమర్శలు
- అశోక్‌నగర్ వేదికగా జరిగిన సమావేశాన్ని ప్రచార ఆర్భాటంగా అభివర్ణించిన వైనం
- కాంగ్రెస్ ప్రకటించిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఒక మిథ్యగా మిగిలిపోయిందని ఆరోపణ
తెలంగాణలో యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు.
"రాహుల్ గాంధీ గారూ... మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో మీరు ఒక నాటకానికి తెరలేపారు. నాటకీయ లైటింగ్ మధ్య ఇరానీ చాయ్ తాగుతూ, ఫొటోలకు పోజులిస్తూ, ఆకాశమే హద్దుగా హామీలు గుప్పించారు. మూడేళ్ల తర్వాత అసలు నిజం బయటపడింది.
రెండు లక్షల ఉద్యోగాలు ఒక మిథ్య. యువ వికాసం ఒక మిరాజ్. మీ జాబ్ క్యాలెండర్ తెలంగాణ యువత నమ్మకాన్ని అపహాస్యం చేసేలా ఉంది. ఉద్యోగాలు కల్పించడం అంటే ఫొటోషూట్ కాదు. చాయ్ తాగుతూ చేసే పబ్లిసిటీ స్టంట్ అంతకంటే కాదు. ఉద్యోగాలు కల్పించాలంటే దార్శనికత ఉండాలి. కనీసం ఒక్క ఉద్యోగం కల్పించాలన్నా అచంచలమైన నిబద్ధత ఉండాలి" అని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల హామీని అమలు చేయడంలో విఫలమైందని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఈ ప్రాంత యువత, ఇప్పుడు తమకు రావాల్సిన ఉద్యోగాల హక్కుల కోసం కూడా అదే రీతిలో పోరాడుతుందని అన్నారు.