- రాజకీయ స్వార్థం కోసం వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్న గద్దె రామ్మోహన్ రావు
- ఆలయ తరలింపు నిర్ణయం 2023లో భూమన ఆధ్వర్యంలోనే జరిగిందని వెల్లడి
- ఆగమ శాస్త్రం ప్రకారమే స్వామివారి విగ్రహాన్ని తాత్కాలిక ఆలయానికి తరలించామని స్పష్టీకరణ
- గత వైసీపీ పాలనలో దేవాలయాలపై జరిగిన దాడులను ప్రజలు ఇంకా మర్చిపోలేదని విమర్శ
రాజకీయ స్వార్థం కోసం మత విద్వేషాలను రెచ్చగొడుతూ, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేణిగుంట సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయ తరలింపు వ్యవహారంలో వైసీపీ నేతలు వాస్తవాలను తొక్కిపెట్టి, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
జాతీయ రహదారి (NH-716) విస్తరణ పనుల నిమిత్తం 2023లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఆలయ తరలింపునకు సంబంధించిన అలైన్మెంట్ ఖరారైందని గద్దె గుర్తుచేశారు. ఆనాడు స్థానిక ఎమ్మెల్యేగా, టీటీడీ ఛైర్మన్గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలోనే జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారితో భూసేకరణ ఉత్తర్వులు ఇచ్చారని స్పష్టం చేశారు. అప్పట్లో ఆలయ నిర్మాణానికి కనీసం నిధులు కేటాయించకుండా గాలికొదిలేసిన వైసీపీ నేతలు, నేడు ఏమీ తెలియనట్లు నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ, స్థానిక ప్రజలు మరియు అర్చకుల సమక్షంలో ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం స్వామివారి విగ్రహాన్ని తాత్కాలిక ఆలయానికి తరలించామని ఆయన తెలిపారు. అంతేకాకుండా నూతన ఆలయ నిర్మాణ పనుల కోసం రూ. 59 లక్షలకు పైగా నిధులు కేటాయించి ఆలయ ఖాతాలో ఫిక్స్డ్ డిపాజిట్ చేయించామని చెప్పారు. ప్రస్తుతం స్థానికులు, అర్చకులు సంతోషంగా గుడి నిర్మాణ పనులు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
గత వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రవ్యాప్తంగా 300కు పైగా ఆలయాలపై దాడులు జరిగినా జగన్ ఏనాడూ పట్టించుకోలేదని గద్దె ఆరోపించారు. రామతీర్థంలో రాముడి విగ్రహం తల తొలగిస్తే మరో విగ్రహం పెట్టుకోవచ్చు అన్నారని, అంతర్వేది రథం దగ్ధమైతే కొత్త రథం చేయించుకోవచ్చు అని నిర్లక్ష్యంగా మాట్లాడారే తప్ప, ఒక్క ఆలయాన్ని కూడా జగన్ దర్శించలేదని విమర్శించారు. అర్చకులు ఇచ్చే తీర్థప్రసాదాలను సైతం స్వీకరించని జగన్కు రాముడి పేరు పలికే నైతిక అర్హత లేదన్నారు. ఆలయాలపై జరిగిన అపచారాల వల్లే 2024 ఎన్నికల్లో దేవుడే వైసీపీకి తగిన శాస్తి చేశారని, ఇప్పటికైనా మత విద్వేష రాజకీయాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.