- వైసీపీ నేతలు అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారన్న బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి
- మహిళ ఆత్మహత్య ఘటనను స్వార్థ రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శ
- ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు భూమన కరుణాకర్ రెడ్డి యత్నిస్తున్నారని వ్యాఖ్య
వైసీపీ నేతలు అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారని, నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేయడమే లక్ష్యంగా ఆ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల చోటుచేసుకున్న గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య ఘటనను స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవడం అత్యంత హేయమైన చర్య అని విమర్శించారు. క్షేత్రస్థాయి వాస్తవాలను పూర్తిగా విస్మరించి.. ప్రభుత్వం, సంబంధిత అధికార వ్యవస్థలపై ఉద్దేశపూర్వకంగా బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ సున్నితమైన అంశంపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారని భాను ప్రకాశ్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజల్లో అనవసర అపోహలు, అయోమయం సృష్టించేందుకే ఇటువంటి ఆరోపణలు తెరపైకి తెస్తున్నారని ఆయన ఆరోపించారు. దురదృష్టకర ఘటనలను కూడా రాజకీయ లబ్ధి కోసం మలచుకోవడం సరికాదని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు.