- సెన్సెక్స్ 1,502 పాయింట్లు, నిఫ్టీ 469 పాయింట్లు జంప్
- నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 3.79 శాతం పైకి
- ప్రైవేట్ బ్యాంకింగ్, ఫైనాన్స్ సూచీలు 2.21 శాతం లాభం
- భారీ కొనుగోళ్లతో హెచ్‌యూఎల్ 6 శాతం అప్
- క్రూడాయిల్ ధరలు తగ్గడంతో మార్కెట్లకు ఊరట
దేశీయ స్టాక్ మార్కెట్లలో బుధవారం బుల్ జోరు కనిపించింది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ.. మన మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఎఫ్ఎంసీజీ, ప్రైవేట్ బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్లలో వెల్లువెత్తిన కొనుగోళ్ల మద్దతుతో సూచీలు పరుగులు తీశాయి. ముగింపు సమయానికి సెన్సెక్స్ 1,500 పాయింట్లకు పైగా ఎగబాకగా, నిఫ్టీ 25,800 మార్కును సునాయాసంగా దాటేసింది.
బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1,502.29 పాయింట్లు (1.82 శాతం) లాభపడి 83,938.28 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ సమయంలో ఓ దశలో 84,498.21 గరిష్ఠ స్థాయిని కూడా తాకింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 469.60 పాయింట్లు (1.85 శాతం) పెరిగి 25,819.25 వద్ద స్థిరపడింది.
రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఏకంగా 3.79 శాతం లాభపడి మార్కెట్‌ను ముందుండి నడిపించింది. హెచ్‌యూఎల్ షేరు ఏకంగా 6 శాతం లాభపడటం మార్కెట్‌కు భారీ ఊపునిచ్చింది. ప్రైవేట్ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు 2.21 శాతం చొప్పున పెరిగాయి. ఫార్మా, హెల్త్‌కేర్, ఆటో, ఐటీ రంగాలు సైతం లాభాల్లో ముగిశాయి. అయితే మీడియా రంగం 4.44 శాతం, మెటల్ సూచీ 2.04 శాతం మేర నష్టపోయి మార్కెట్ వేగానికి కాస్త బ్రేకులు వేశాయి.
గ్లోబల్ మార్కెట్లలో ఏఐ టెక్నాలజీ షేర్ల అమ్మకాలు, అమెరికా వడ్డీ రేట్ల పెంపు భయాలు ఉన్నప్పటికీ, భారత మార్కెట్ తన అంతర్గత బలాన్ని ప్రదర్శించిందని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. పామాయిల్, క్రూడాయిల్ ధరలు తగ్గడం ఎఫ్ఎంసీజీ కంపెనీల మార్జిన్లకు కలిసివస్తుందనే నమ్మకంతో ఇన్వెస్టర్లు లార్జ్ క్యాప్ షేర్ల వైపు మొగ్గు చూపారు.