- విజయనగరం, విశాఖ, పల్నాడు జిల్లాల్లో జరిగిన ఘటనలు
- మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు సంతాపం
- ప్రమాద కారణాలపై విశ్లేషణ చేసి, చర్యలు తీసుకోవాలని ఆదేశం
- క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచన
ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి చెందడంపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం విజయనగరం, విశాఖపట్నం, పల్నాడు జిల్లాల్లో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనల వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదాలకు గల కారణాలను విశ్లేషించి, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్యాంకర్ను ఓ వాహనం వెనుక నుంచి ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడమే ఈ ప్రమాదానికి ప్రాథమిక కారణంగా అధికారులు సీఎంకు వివరించారు. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
విశాఖ జిల్లా ఆనందపురం మండలం బాటజంగాలపాలెం టోల్గేట్ వద్ద జరిగిన మరో ప్రమాదంలో లారీ క్యాబిన్లో మంటలు చెలరేగి డ్రైవర్, క్లీనర్ సజీవ దహనమయ్యారు. ఇక, పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలో అమరావతిలో దర్శనం ముగించుకుని తిరిగి వస్తున్న అయ్యప్ప భక్తుల కారు, డ్రైవర్ నిద్రమత్తు కారణంగా అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరొకరు గాయపడ్డారు.
ఈ మూడు ఘటనలపై సమగ్ర సమీక్ష జరపాలని పోలీస్, రవాణా శాఖ అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ప్రమాదాల కట్టడికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన ఆదేశించారు.