- భోగాపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
- లారీని ఢీకొట్టి కారు దగ్ధం.. నలుగురి మృతి
- శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళ్తుండగా దుర్ఘటన
- మృతుల కుటుంబాలకు మంత్రి నారా లోకేశ్ ప్రగాఢ సానుభూతి
విజయనగరం జిల్లా భోగాపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సుందరపేట సమీపంలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని ఐదుగురు వ్యక్తుల్లో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న కారుకు ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘోర ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన వ్యక్తిని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనతో జాతీయ రహదారిపై విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ ఘటనపై రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "భోగాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడటం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మృతులకు నివాళులర్పిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని లోకేశ్ భరోసా ఇచ్చారు.